ఇంతకాలం రాష్ట్రంలో ఎక్కడ బొగ్గు నిల్వలున్నా కొత్త గనులను ఈ సంస్థ తవ్వేది. ఇప్పుడలా తవ్వడానికి వీల్లేదు. ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు వేలం ద్వారా సొంతం చేసుకోవచ్చు. బొగ్గు నిల్వలు పూర్తవుతున్న దృష్ట్యా రానున్న పదేళ్లలో 16 గనులను మూసేసి వాటి స్థానంలో కొత్త గనులను తవ్వాల్సి ఉంటుంది. ప్రైవేటు సంస్థలతో సింగరేణి పోటీపడి తక్కువ ధరకే బొగ్గు తవ్వడం సాధ్యమవుతుందా? అన్న చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఈ సంస్థ తవ్వే బొగ్గు టన్ను సగటు ధర రూ.2400 వరకు ఉంటుంది
బహిరంగ వేలం విధానంపై సింగరేణిలో ఆందోళన - సింగరేణిలో తవ్వాలంటే తంటాలే!
బొగ్గు గనులను బహిరంగ వేలం ద్వారా ఎవరికైనా విక్రయించే కొత్త విధానాన్ని కేంద్రం ప్రారంభించడం పట్ల సింగరేణి సంస్థలో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రైవేటు సంస్థలతో సింగరేణి పోటీపడి తక్కువ ధరకే బొగ్గు తవ్వడం సాధ్యమవుతుందా? అన్న చర్చ సాగుతోంది. అధికారులు కీలక నిర్ణయాలు తీసుకుంటేనే సింగరేణి మనుగడపై స్పష్టత వచ్చే అవకాశముంది
ప్రైవేటు సంస్థలు ఇంతకన్నా చాలా తక్కువ ధరకే బొగ్గు తవ్వే అవకాశాలున్నాయి. సింగరేణిలో సగటు వేతనం రూ.50 వేలకుపైగా ఉంది. ప్రైవేటు గనుల్లో అందులో సగమే ఇచ్చి తవ్వకాలు సాగిస్తారు. ఉదాహరణకు ప్రస్తుతం ఓపెన్‌కాస్ట్(ఉపరితల) బొగ్గు గనుల్లో మట్టి తవ్వడానికి క్యూబిక్ మీటరుకు రూ.220 దాకా సింగరేణికి ఖర్చవుతోంది. అదే గనిలో కొంత పనిని ప్రైవేటు కాంట్రాక్టర్లకు ఇస్తే అదే క్యూబిక్ మీటరును రూ.120 నుంచి 140కే తవ్వేస్తున్నారు.
ఉపరితల గనిని తీసుకునే ప్రైవేటు సంస్థలకు నష్టాలుండవు కాబట్టి తక్కువ ధరకే బొగ్గు అమ్మే అవకాశాలుంటాయని ఓ సీనియర్ అధికారి తెలిపారు. కొవిడ్ కారణంగా లాక్‌డౌన్‌కు ముందు ప్రతిరోజూ 1.80 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి అయితే ఇప్పుడు అందులో సగమే ఉంటోంది. అధికారులు కీలక నిర్ణయాలు తీసుకుంటేనే సింగరేణి మనుగడ సాధ్యమవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
TAGGED:
సింగరేణిలో తవ్వాలంటే తంటాలే!