లాక్డౌన్ నేపథ్యంలో గత రెండున్నర నెలలుగా బస్సులు, క్యాబ్‌లు నడపలేదని క్యారేజ్ బస్సులు, క్యాబ్ యాజమాన్యం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. మూడు నెలల పన్నును మినహాయించాలని డిమాండ్ చేశారు.
'తమకు ఆ పన్ను మినహాయించాలని ఆందోళన'
లాక్‌డౌన్‌తో గత రెండున్నర నెలలుగా బస్సులు, క్యాబ్‌లు నడపలేదని.. ఈ నేపథ్యంలో తమకు మూడు నెలల పన్నును మినహాయించాలని క్యారేజ్ బస్సులు, క్యాబ్ యాజమాన్యం నిరసన చేపట్టారు.
'తమకు ఆ పన్ను మినహాయించాలని ఆందోళన'
వాహనాలు నడపనందున ట్యాక్స్ మినహాయించాలని ఆర్టీఏ అధికారులకు మెమోరాండం సమర్పించారు. ఇప్పటికే లాక్‌డౌన్‌తో ఆదాయం కోల్పోయామన్నారు. ఈ పన్నుతో తమపై మరింత భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించి అడ్డుకున్నారు.
ఇదీ చూడండి :సెలవిక: బరువెక్కిన జన హృదయం.. అడుగడుగునా పూలవర్షం