రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తిపై మళ్లీ ఆందోళన నెలకొంది. కేసులు పెరుగుతాయనే అంచనాలు కలకలం రేపుతున్నాయి. ఈ ఏడాది జులై నుంచి రాష్ట్రంలో రెండోదశ ఉద్ధృతి క్రమేణా తగ్గుముఖం పడుతూ వస్తోంది. నెమ్మదిగా సాధారణ జనజీవనం మొదలై కొవిడ్ నిబంధనలపై శ్రద్ధ తగ్గింది. ఈ నిర్లక్ష్య ధోరణి కారణంగా.. గత 2 వారాలుగా క్రమేణా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటికీ రోజుకు 180 నుంచి 200 వరకూ కొత్త కేసులు నమోదవుతుండడం ఆందోళనకర పరిణామమే. అంతరాష్ట్ర, అంతర్జాతీయ రాకపోకలు కొనసాగుతుండడం.. ఇదే సమయంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పొరుగు రాష్ట్రం కర్ణాటకలోకి ప్రవేశించడంతో.. ఇప్పుడు కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
వెంటాడుతున్న భయం
కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో.. తెలంగాణలోనూ ఆ జాడలు కనిపించే అవకాశాలున్నాయా? అనే భయం వెంటాడుతోంది. బుధవారం రెండు అంతర్జాతీయ విమానాల ద్వారా రాష్ట్రానికి వచ్చిన వారిలో తెలంగాణకు చెందిన వారు 239 మంది, ఏపీకి చెందిన వారు 72 మంది, మహారాష్ట్రకు చెందినవారు 10 మంది, మధ్యప్రదేశ్‌కు చెందినవారు ఇద్దరు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక్కరు, రాజస్థాన్‌కు చెందిన ఒక్కరున్నారు. వీరి సమాచారాన్ని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ నుంచి ఇతర రాష్ట్రాల ఆరోగ్యశాఖలకు పంపించారు. బుధవారమే బ్రిటన్ నుంచి వచ్చిన ఓ మహిళకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ కావడంతో విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు. మహిళను గచ్చిబౌలిలోని టిమ్స్‌కు తరలించి ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఆమె పరీక్షల నమూనాలను జన్యుక్రమ పరిశీలన కోసం హైదరాబాద్ సీసీఎంబీకి పంపారు.
జిల్లా వైద్యాధికారికి..