రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని భాజపా కిసాన్ మోర్చా నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన శ్రేణులు.. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం... వ్యవసాయ కమిషనరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా... దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎరువల కొరత సమస్యను పరిష్కరించాలని కోరారు. కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి పంట బీమా పథకం ఇతర రాష్ట్రాలు అమలు చేస్తుంటే... రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు.
వర్షానికి దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలి: కిసాన్ మోర్చా - BJP Kisan Morcha news
వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద భాజపా కిసాన్ మోర్చా శ్రేణులు ఆందోళన నిర్వహించారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలని నిరసన వ్యక్తం చేశారు.
వర్షానికి దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలి: కిసాన్ మోర్చా
ఒకదశలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డిని పోలీసులు బలవంతంగా ఎత్తుకుని వ్యాన్ ఎక్కించారు. అరెస్టు చేసిన ఆందోళనకారులను గోశామహల్ పోలీసుస్టేషన్‌కు తరలించారు.
ఇవీ చదవండి:శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకున్న హైకోర్టు సీజే మహేశ్వరి
Last Updated : Aug 31, 2020, 4:42 PM IST