హైదరాబాద్ కింగ్ కోఠి ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ఆందోళన మూడో రోజూ కొనసాగింది. కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నా.. ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న తమను ప్రభుత్వం గుర్తించడం లేదంటూ వైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి వైద్యులు తమకు క్వారంటైన్ సెలవులు సైతం ఇవ్వడం లేదంటూ ఆరోపించారు.
కింగ్‌కోఠి ఆసుపత్రిలో మూడో రోజూ కొనసాగిన ఆందోళన - కింగ్‌కోఠిలో వైద్య సిబ్బంది ఆందోళన వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తోన్న వైద్య సిబ్బందికి ప్రభుత్వం ఇస్తానన్న 10 శాతం ఇన్సెంటివ్ తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ కింగ్‌కోఠి ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ఆందోళన చేపట్టారు.
![కింగ్‌కోఠి ఆసుపత్రిలో మూడో రోజూ కొనసాగిన ఆందోళన Concern continued for a third day at King Kothi Hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8327318-510-8327318-1596782577971.jpg)
కింగ్‌కోఠి ఆసుపత్రిలో మూడో రోజూ కొనసాగిన ఆందోళన
ప్రభుత్వం 10 శాతం ఇన్సెంటివ్ ఇస్తానని చెప్పి, మాట తప్పిందని.. వెంటనే ఇన్సెంటివ్‌తో పాటు క్వారంటైన్ సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.