తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంజినీరింగ్ కాలేజీల్లో భారీగా పెరిగిన కంప్యూటర్ కోర్సు సీట్లు - computer courses Increased in telangana

computer courses Increased in engineering colleges: రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కంప్యూటర్‌ కోర్సులు పెరిగాయి. మొత్తం 89 కాలేజీల్లో 9,240 కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ నెల 28న ప్రారంభమయ్యే రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియలో ఈ సీట్లు అందుబాటులో ఉండనున్నాయి.

ఇంజినీరింగ్ కాలేజీల్లో భారీగా పెరిగిన కంప్యూటర్ కోర్సులు
ఇంజినీరింగ్ కాలేజీల్లో భారీగా పెరిగిన కంప్యూటర్ కోర్సులు

By

Published : Sep 13, 2022, 9:29 PM IST

computer courses Increased in engineering colleges: ఇంజినీరింగ్ కాలేజీల్లో సుమారు 9,240 కంప్యూటర్ కోర్సులు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 89 కాలేజీలు సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ, మైనింగ్ వంటి కోర్సుల్లో సీట్లు తగ్గించుకొని.. వాటి స్థానంలో కంప్యూటర్ కోర్సులకు అనుమతి తెచ్చుకున్నాయి. ఎక్కువగా సీఎస్ఈ, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంజినీరింగ్, మెషిన్ లెర్నింగ్ కోర్సుల్లో సీట్లు పెంచుకున్నాయి. కంప్యూటర్ కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఉండగా.. సంప్రదాయ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. దీంతో కంప్యూటర్ కోర్సులు ప్రవేశపెట్టేందుకు కాలేజీలు మొగ్గు చూపాయి.

అయితే మొత్తం సీట్ల సంఖ్య పెరగకూడదని ప్రభుత్వం షరతు విధించడంతో.. సివిల్, ట్రిపుల్ ఈ, మెకానికల్ వంటి సీట్లను వెనక్కి ఇచ్చి.. వాటి స్థానంలో డిమాండ్ ఉన్న కోర్సులకు అనుమతి పొందాయి. ఈ కొత్త సీట్లు అందుబాటులోకి రాకముందే మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయింది. ఈ నెల 28న ప్రారంభమయ్యే రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియలో ఈ సీట్లు అందుబాటులో ఉంటాయి.

భారీగా పెరిగిన ఫీజులు..: రాష్ట్రంలో ఇంజినీరింగ్ ఫీజులు ఇటీవల భారీగా పెరిగాయి. తెలంగాణలోని ప్రముఖ కాలేజీలు సహా 36 కాలేజీల్లో ఫీజు లక్ష రూపాయలు దాటింది. ఏడు కళాశాలల్లో ఫీజు లక్షన్నర మించింది. రాష్ట్ర ప్రభుత్వం ఫీజులపై ఉత్తర్వులు ఇవ్వకుండానే కౌన్సెలింగ్ ప్రారంభించడంతో.. కళాశాలలు హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు పొందాయి. ఇప్పటి వరకు 79 ఇంజినీరింగ్ కాలేజీలు హైకోర్టు నుంచి అనుమతి పొందగా.. మరికొన్ని కాలేజీలు అదే బాట పట్టేందుకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో మూడేళ్లకోసారి ఇంజినీరింగ్ ఫీజులను సవరిస్తారు. మూడేళ్లు పూర్తి కావడంతో ఈ ఏడాది ఫీజుల సమీక్ష కోసం రాష్ట్ర ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ నోటిఫికేషన్ ఇచ్చింది. కాలేజీలు ఫీజులు పెంచుతూ ప్రతిపాదనలు సమర్పించగా.. యాజమాన్యాలను ఏఎఫ్ఆర్సీ అధికారులు పిలిపించి చర్చించారు.

ఆ సందర్భంలో కళాశాలల యాజమాన్యాలు అంగీకరించిన ఫీజులను ఏఎఫ్ఆర్సీ రిజిస్టర్​లో నమోదు చేసింది. అయితే కరోనా పరిస్థితులు, ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది పాత ఫీజులను కొనసాగించాలని నిర్ణయించిన ఏఎఫ్ఆర్సీ గత నెల 1న ప్రభుత్వానికి నివేదిక పంపించింది. ప్రభుత్వం దానిపై తుది నిర్ణయం తీసుకోక ముందే.. గత నెల 21 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించడంతో పలు కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఏఎఫ్ఆర్సీ ఎదుట తాము అంగీకరించిన ఫీజుల వసూలు అనుమతించాలని కోరాయి. ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వకపోవడం.. మరోవైపు కౌన్సెలింగ్ ప్రారంభమైనందున.. ప్రవేశాల్లో ఆలస్యం జరగకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ఏఎఫ్ఆర్సీ వద్ద అంగీకరించిన ఫీజులను వసూలు చేసేందుకు కాలేజీలకు అనుమతినిచ్చింది.

ఇవీ చూడండి..

భారీగా పెరిగిన ఇంజినీరింగ్ కోర్సుల ఫీజులు, ఆ ర్యాంకు దాటినవారిపై మరింత భారం

గిన్నెను తాకిందని దళిత దివ్యాంగురాలిపై వేడి నీరు పోసిన టీచర్​

ABOUT THE AUTHOR

...view details