తెలంగాణ

telangana

వ్యర్థాలకు అర్థం మార్చే యంత్రాలు..!

By

Published : Oct 31, 2020, 7:19 AM IST

పర్యావరణహిత సేంద్రీయ వ్యర్ధాలను ఎరువుగా మార్చే కార్యక్రమానికి దక్షిణ మధ్య రైల్వే శ్రీకారం చుట్టింది. రైల్వేస్టేషన్లు, పరిసరాల్లోని చెత్తను వేరుపరచి ఎరువుగా మార్చే రెండు కంపోస్టింగ్​ యంత్రాలను కాజీపేట రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసింది.

composting machines set in kazipet railway station in hyderabad
వ్యర్థాలకు అర్థం మార్చే యంత్రాలు..!

పర్యావరణ అనుకూల చర్యల్లో భాగంగా దక్షిణమధ్య రైల్వే మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైల్వేస్టేషన్లు, పరిసరాల్లో పారేసే సేంద్రియ వ్యర్థాల్ని ఎరువుగా మార్చి తిరిగి ఉపయోగించేలా రెండు కంపోస్టింగ్‌ యంత్రాలను హైదరాబాద్‌, కాజీపేట స్టేషన్లలో ఏర్పాటు చేసింది. 50 కిలోల సామర్థ్యం కలిగిన ఒక్కో యంత్రానికి రూ.2.15 లక్షలు ఖర్చయినట్లు తెలిపింది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ సంస్థ ఈ యంత్రాల ఏర్పాటుకు ఆర్థిక సహకారం అందించింది.

స్టేషన్లలో ఊడ్చినప్పుడు, చెట్ల ద్వారా, క్యాంటీన్లు, వంటశాలల నుంచి.. ప్లాస్టిక్‌ పేపర్లు, గ్లాసుల రూపంలో వ్యర్థాలు వస్తుంటాయి. వాటిని వేరు చేయకుండా అన్నిరకాల వ్యర్థాల్ని మున్సిపల్‌ సిబ్బందికి అందిస్తుంటారు. తాజా ఏర్పాట్ల నేపథ్యంలో సేంద్రియ వ్యర్థాల్ని వేరుచేసి ఈ యంత్రాల్లో వేయనున్నట్లు, తద్వారా వచ్చే సేంద్రియ ఎరువుల్ని స్టేషన్లలోని గార్డెన్లకు ఉపయోగిస్తామని ద.మ.రైల్వే తెలిపింది.

ఇదీ చూడండి:గత నాలుగు రోజుల్లో 203 మంది అదృశ్యం.. కారణాలివేనా?

ABOUT THE AUTHOR

...view details