నిమ్స్, ఉస్మానియా, గాంధీ దవాఖానాల్లో అరుదైన, కీలకమైన శస్త్రచికిత్సలు (Complicated Surgeries in Govt Hospitals ) చేస్తున్నారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థల సాయంతో ప్రభుత్వ ఆసుపత్రులకు అధునాతన వైద్య పరికరాలు సమకూరుతున్నాయి. ఇటీవలే ఓ స్వచ్ఛంద సంస్థ ఆధునిక 2డీ ఈకే యంత్రాన్ని సమకూర్చింది. ఎంఎన్‌జేలో బోన్‌మ్యారో మార్పిడి యంత్రాలను ప్రభుత్వం సమకూర్చింది. ఇలాంటి ఆధునిక పరికరాలతో అధునాతన చికిత్సల (Complicated Surgeries in Govt Hospitals ) ను అందిస్తున్నారు. ఉస్మానియాలో ఇప్పటివరకు ఉచితంగా 700 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేసి వైద్యులు రికార్డు సృష్టించారు. ప్రైవేటులో రూ. 7-10 లక్షల వరకు ఖర్చయ్యే కిడ్నీ మార్పిడులను నిమ్స్‌లో లక్షన్నరలోనే.. ఉస్మానియా, గాంధీలో ఉచితంగానూ చేస్తున్నారు. లక్షల్లో ఖర్చయ్యే బోన్‌మ్యారో మార్పిడి చికిత్సల (Complicated Surgeries in Govt Hospitals ) ను నాంపల్లి ఎంఎన్‌జే ఆసుపత్రిలో ఉచితంగా నిర్వహిస్తున్నారు. గత రెండు నెలల్లో అయిదుగురు పేద రోగులకు ఈ చికిత్సలు చేశారు. నిత్యం గాంధీలో అన్ని రకాల శస్త్రచికిత్సలు కలిపి 60-70 వరకు, ఉస్మానియాలో 70-80, నిమ్స్‌లో 100 సర్జరీలు చేస్తున్నారు. వీటిలో 20-30 శాతం వరకు సంక్లిష్టమైనవి ఉంటున్నాయి.
- నల్గొండ జిల్లాకు చెందిన ఓ నర్సింగ్ విద్యార్థిని(18)కి ఇటీవలే ఉస్మానియా వైద్యులు అరుదైన సర్జరీ చేశారు. ఆమె కుడివైపు రొమ్ములో ఇబ్బంది ఏర్పడింది. తల్లిదండ్రులు ఉస్మానియాలో సంప్రదించారు. వైద్యులు ప్లాస్టిక్ సర్జరీ చేసి సరిచేయవచ్చునని తెలిపారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో దాదాపు రూ. 5 లక్షలు ఖర్చయ్యే ఈ సర్జరీని రూపాయి కూడా ఖర్చు లేకుండా చేసి అమ్మాయికి కొత్త జీవితాన్ని ఇచ్చారు వైద్యులు.
- గగన్‌పహాడ్‌కు చెందిన ఓ యువతి(17) మానసిక సమస్యతో బాధపడుతోంది. ఇంతలో కడుపులో నొప్పి మొదలైంది. తండ్రి ఉస్మానియా వైద్యులను సంప్రదించాడు. ఆమె పొట్టలో తలవెంట్రుకలు ముద్దలుగా ఉన్నట్లు గుర్తించారు. మానసిక సమస్య వల్ల ఆమె వాటిని తింటున్నట్లు గుర్తించి, సర్జరీ చేసి పొట్ట నుంచి 2 కిలోల వెంట్రుకల ముద్దను తీసి ప్రాణాలు కాపాడారు.
- కరోనా రెండోదశలో అనేకమంది బ్లాక్‌ఫంగస్ బారిన పడ్డారు. చాలామందికి శస్త్ర చికిత్సలు అవసరమయ్యాయి. ప్రైవేటులో ఒక్కో శస్త్ర చికిత్సతో పాటు మందులకు రూ. లక్షల్లోనే ఖర్చు అవుతుంది. ఈ సమయంలో గాంధీ, ఈఎన్‌టీ, సరోజినీదేవి ఆసుపత్రులు ఆదుకున్నాయి. 2-3 వేల మందికి ఈ మూడు ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సలు చేసి ప్రాణాలు కాపాడారు. ఖరీదైన మందులను కూడా 3 నెలల పాటు ఉచితంగానే అందించారు.