హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ దక్షిణ మండలం ఇంఛార్జీ డీసీపీ అవినాష్ మహంతిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఈ నెల 10న ముస్లిం యునైటెడ్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ అనంతరం.. ముస్లింలు ఇంటికి తిరిగి వెళ్తుండగా అవినాష్ మహంతి అకారణంగా లాఠీతో కొందరిని కొట్టారని ఆరోపించాడు.
డీసీపీ అవినాష్ మహంతిపై ఓ వ్యక్తి ఫిర్యాదు - డీసీపీ అవినాష్ మహంతిపై ఓ వ్యక్తి ఫిర్యాదు
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట2 దక్షిణ మండలం ఇంఛార్జీ డీసీపీ అవినాష్ మహంతిపై ఫిర్యాదు నమోదైంది. అకారణంగా ముస్లింలను లాఠీతో కొట్టారని ఓ వ్యక్తి బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు పెట్టాడు.
డీసీపీ అవినాష్ మహంతిపై ఓ వ్యక్తి ఫిర్యాదు
ఆయన కొట్టిన సమయంలో బాధితుల చేతిలో ఉన్న జాతీయ పతాకం కింది పడిపోయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే అతని ఫిర్యాదును బంజారాహిల్స్ పోలీసులు స్వీకరించపోనందున... పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌కు విషయం తెలిపాడు. కమిషనర్ ఆదేశాలతో పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. కేసు కూడా నమోదు చేసినట్లు సమాచారం.
ఇవీ చూడండి: స్వగృహానికి హన్మకొండ యువతి మృతదేహం
Last Updated : Jan 12, 2020, 9:08 AM IST