తెలంగాణ రాష్ట్రంలో 2020 సంవత్సరంకు గాను హజ్ యాత్రకు వెళ్ళేందుకు దరఖాస్తు గడువు సోమవారంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా హజ్ యాత్ర కొరకు 10,613 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా హైదరాబాద్ నుంచి 6421 మంది దరఖాస్తు చేసుకోగా..రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి అత్యల్పంగా రెండు దరాఖాస్తులు మాత్రమే వచ్చాయని హజ్ కమిటీ ఛైర్మన్ మహ్మద్ మాసీవుల్లా ఖాన్ తెలిపారు.
ఇందులో 70 ఏళ్ళు పైబడిన వారు 462 మంది మినహా మిగిలిన 10,143 మందికి జనవరి 4న లాటరీ పద్ధతి ద్వారా తుది ఎంపిక చేస్తామని ఛైర్మన్ వెల్లడించారు. యాత్రకు సంబంధించిన ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని..మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. హజ్ యాత్రకు వెళ్ళే తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు.
హజ్‌యాత్రకు 10వేల 613 దరఖాస్తులు - Completion of applications for Hajj Yatra 2020
రాష్ట్రంలో 2020 హజ్ యాత్రకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువు సోమవారంతో ముగిసింది. హజ్‌యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా 10వేల 613 దరఖాస్తులు అందాయని రాష్ట్ర హజ్ కమిటీ ఛైర్మన్ మహ్మద్ మసీవుల్లాఖాన్ తెలిపారు.

హజ్‌యాత్రకు 10వేల 613 దరఖాస్తులు
హజ్‌యాత్రకు 10వేల 613 దరఖాస్తులు
ఇదీ చూడండి : సీడీఎస్, ఎన్పీఆర్కు కేంద్ర కేబినెట్ పచ్చజెండా