సేంద్రియ ప్రదర్శన పరిసమాప్తం
ఏదీ తిందామన్నా కల్తీనే. ఎన్నో ఆరోగ్య సమస్యలు. ఏం తినాలో, ఏం తినకూడదో తెలియని పరిస్థితి. మళ్లీ పాత రోజుల్లాగే సేంద్రియ ఆహార పదార్థాలకు గిరాకీ పెరుగుతోంది. వాటి ప్రాముఖ్యతను తెలిపేలా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్ విజయవంతంగా ముగిసింది.
సేంద్రియ ప్రదర్శన పరిసమాప్తం
కూరగాయలు, పండ్లు, తేనె, పప్పులు, చిరుధాన్యాలు, బట్టలు, వనమూలికలు, సబ్బులు, షాంపూలు ఇలా ఒక్కటేమిటి ప్రతీది సేంద్రియ ఉత్పత్తే. వివిధ రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాళ్లకు మంచి స్పందనే వచ్చింది. ఇదే స్పూర్తితో సేంద్రియ ఉత్పత్తుల వినియోగాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని కేంద్ర మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి నందితా మిశ్రా పిలుపునిచ్చారు.
దక్షిణాది రాష్ట్రాలకు గేట్ వే వంటి హైదరాబాద్లో విమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానికి ఫెస్టివల్ ఏర్పాటు చేయడం సంతోషాన్నిచ్చిందని ఎంపీ కవిత అన్నారు. సేంద్రియ వ్యవసాయం చేసే ప్రతి రైతు... సేంద్రియ రైతుగా సర్టిఫికేషన్ పొందాలని సూచించారు. కేంద్రం రాయితీలు ప్రకటించి సేంద్రియ రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
సేంద్రియ ఉత్పత్తులను పెంచి... దిగువ మధ్యతరగతి ప్రజలకు ధరలు అందుబాటులోకి తీసుకురావాలని నగరవాసులు ఆకాంక్షించారు.