కొవిడ్ రోగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన టిమ్స్ ఆస్పత్రిలో అందుతున్న సేవలపై హైదరాబాద్‌కు చెందిన రమేశ్, మంజుల దంపతులు.. రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు టిమ్స్ వైద్య సేవలపై వారు పంపిన వీడియోను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ట్వీట్ చేశారు.
గత నెల 28న మాకు కొవిడ్ సోకింది. సన్నిహితులు, వైద్యుల సలహాతో టిమ్స్ ఆస్పత్రిలో చేరాం. కొవిడ్ నుంచి కోలుకొని ఆదివారం డిశ్చార్జ్ అయ్యాం. టిమ్స్‌లో చాలా మంచి వైద్యం అందించారు. అక్కడి వైద్యులు తమకు మనోధైర్యం కల్పించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంత మంచి వైద్యం దొరుకుతుందా అనిపించింది. కొవిడ్ బాధితులకు ఉచితంగా మెరుగైన సేవలు అందిస్తోన్న టిమ్స్ ఆస్పత్రి, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు.