Complaints to EC on Telangana Elections 2023: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తోందని భారత రాష్ట్ర సమితి ఆరోపించింది. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రతినిధి బృందం.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారివికాస్‌రాజ్‌ను కలిసి.. ఆరు అంశాలపై ఫిర్యాదు చేసింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హింసను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని గతంలోనే ఫిర్యాదు చేసినా.. ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వెల్లడించింది.
BRS Legal Team Complaint To EC Against Revanth Reddy : రేవంత్ వ్యాఖ్యలపై 11 వీడియోల ఆధారాలతో ఫిర్యాదు చేశామని.. చర్యలు తీసుకోకపోతే ప్రజల వద్దకు వెళతామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. అనుమతి రద్దు చేసిన ప్రకటనలను కాంగ్రెస్ పార్టీ సినిమా హాళ్లలో ప్రదర్శిస్తోందని వివరించారు. క్రెడిట్, డెబిట్ కార్డుల తరహాలో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డులను పంపిణీ చేస్తోందన్న గులాబీ నేతలు.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. మైనంపల్లి హన్మంతరావు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. ఆయన వ్యాఖ్యలపై ఈసీ, పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల నిర్వహణలో సవాళ్లు - కమాండ్ కంట్రోల్ ద్వారా అన్ని నియోజకవర్గాలపై ఈసీ నజర్
BSP Leader Complaint To EC Against KCR : గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, సీఎం కేసీఆర్.. తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల గురించి తప్పుడు సమాచారం పొందుపరిచారని ఆ నియోజకవర్గం బీఎస్పీ అభ్యర్థి సంజయ్‌కుమార్ ఆరోపించారు. ప్రజలను, చట్టాన్ని.. కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారన్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ నామినేషన్, అఫిడవిట్ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్న సంజయ్.. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ను కలిసినట్లు వెల్లడించారు.