ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న మొక్కను దొంగిలించారని పోలీస్‌స్టేషన్‌లో ఓ విశ్రాంత ఐపీఎస్ అధికారి ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 18లో విశ్రాంత ఐపీఎస్ అధికారి అప్పారావు నివాసముంటున్నారు. ఆయన ఇంట్లోనే ఎన్నో అరుదైన మొక్కలను పెంచుతున్నారు.
మొక్క పోయిందని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు - hyderabad latest news
మొక్కనే ప్రాణంగా పెంచుకుంటున్నాడు ఓ విశ్రాంత ఐపీఎస్ అధికారి. అంతలోనే దానిపై దొంగలు కన్నేశారు. అత్యంత ఖరీదైన ఆ మొక్కను ఎత్తుకెళ్లారు. అత్యంత ఇష్టమైన మొక్క చోరీకి గురవడంతో జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు.
ఆయన పెంచుకుంటున్న అరుదైన మొక్కల్లో బొన్సాయి ఒకటి. దీని విలువ మార్కెట్‌లో లక్ష రూపాయలకు పైగా పలుకుతుందని అప్పారావు తెలిపారు. ఆ మొక్కను దొంగతనం చేశారని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను 40ఏళ్లుగా అరుదైన మొక్కలు పెంచుతున్నానని, ఎప్పుడూ ఇలా చోరీకి గురికాలేదన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆ ఇంటికి సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలను పరిశీలిస్తున్నారు.
ఇదీ చదవండి: దేశ రైతులు సాధించిన పాక్షిక విజయం: నిరంజన్‌రెడ్డి