ఆర్టీసీ కార్మికులను ఇబ్బందులకు గురి చేయాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోందని ఆర్టీసీ ఐకాస కో-కన్వీనర్ థామస్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లోని కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయానికి కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమను డిపో మేనేజర్లు విధుల్లోకి తీసుకోవడం కార్మిక శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
ఆర్టీసీ యాజమాన్యంపై కార్మికశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు - Complaint to the Commissioner of Labor over TSRTC ownership
ఆర్టీసీ యాజమాన్యంపై కార్మికులు కార్మికశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తాము విధుల్లో చేరతామన్నా... చేర్చుకోవడం లేదని ఆవేదన చెందారు.
ఆర్టీసీ యాజమాన్యంపై కార్మికశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు
సేవ్‌ఆర్టీసీ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం కార్మికుల సమస్యల పట్ల మొండిగా వ్యవహరించడం సరికాదన్నారు. హైకోర్టు ఉత్తర్వులను గౌరవించి తాము సమ్మెను విరమించామని తెలిపారు. ఆర్టీసీ ఎండీ ప్రకటనలు కార్మికుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమని విధుల్లోకి తీసుకోవాలని... పనిచేసిన కాలానికి జీతాలు ఇప్పించాలని కోరారు.
ఇదీ చదవండిః రాజధాని శివారులో మహిళా వైద్యురాలి దారుణహత్య