కేసీఆర్ సభతో తెరాస ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఎల్బీ స్టేడియం, చుట్టుపక్కల ఉన్న ప్రజా ఆస్తులపై తెరాస పార్టీ జెండాలను ప్రదర్శించడం నియమావళికి వ్యతిరేకమని టీపీసీసీ ఎన్నికల సంఘం సమన్వయ కమిటీ నిరంజన్ వెల్లడించారు.
కేసీఆర్ సభపై ఎస్ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు - Telangana Election Commissioner Parthasarathy Latest News
కేసీఆర్ సభపై కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తెరాస ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరింది.
కేసీఆర్ సభపై కాంగ్రెస్ ఎస్ఈసీకి ఫిర్యాదు
''ఎల్బీ స్టేడియంలో జరగనున్న కేసీఆర్ బహిరంగ సమావేశానికి మాత్రమే అనుమతినిచ్చారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ.. ప్రజా ఆస్తులను దుర్వినియోగం చేసేందుకు కాదని''.. ఎస్ఈసీకి వివరించారు. నియమావళిని ఉల్లంఘించి ఏర్పాటు చేసిన పార్టీ జెండాలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఉల్లంఘనలకు చెందిన వీడియో క్లిప్పింగ్‌తో ఈసీకి ఫిర్యాదు చేశారు.
ఇదీ చూడండి: నేడు ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ
Last Updated : Nov 28, 2020, 10:32 AM IST