తెలంగాణ

telangana

ETV Bharat / state

చంద్రబాబు సహా అప్పటి మంత్రులపై లోకాయుక్తలో ఫిర్యాదు - CLOKAYUKTHA CASE FILED ON TDP LEADERS

తెదేపా అధికారంలో ఉన్నప్పుడు అప్పటి సీఎం చంద్రబాబుసహా మంత్రులు అక్రమంగా వేలకోట్లు సంపాదించారని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఉదయ్​కిరణ్​ లోకాయుక్తాలో ఫిర్యాదు చేశారు. అక్రమ సంపాదనను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

COMPLAINT ON CHANDRABABU IN LOKAYUKTHA ABOUT HIS PROPERTY

By

Published : Sep 26, 2019, 8:56 PM IST

ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై లోకాయుక్తలో ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెదేపా మాజీ మంత్రులపై లోకయుక్తలో జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు దేరంగుల ఉదయ్​కిరణ్ ఫిర్యాదు చేశారు. తెదేపా ఐదేళ్ల పాలనలో ఇసుక మాఫియా, రాజధాని అక్రమాలు, పోలవరం ప్రాజెక్టుల్లో చేసిన అక్రమాలు వెలుగులోకి తీసుకురావాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు వేలకోట్లు అక్రమంగా సంపాదించారని... ఎమ్మెల్యేలు, మంత్రులు ఇష్టానుసారంగా అవినీతి చేశారని ఆరోపించారు. ప్రజాధనాన్ని లూటీ చేసినందుకు చంద్రబాబు నాయుడు , మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరారు. వారి దగ్గరి నుంచి అక్రమ సంపదను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని లోకయుక్త జస్టిస్ లక్ష్మారెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు ఉదయ్​కిరణ్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details