3 రోజులుగా తప్పించుకు తిరుగుతున్న ఒమిక్రాన్ బాధితుడి ఆచూకీ లభ్యం - తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు
16:37 December 17
వైద్యారోగ్య శాఖ అధికారులకు అప్పగించిన పోలీసులు
Omicron in Telangana: గత మూడు రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న ఒమిక్రాన్ రోగి ఆచూకీ లభ్యమైంది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని ఓ గెస్ట్ హౌస్లో బాధితుడు ఉన్నట్లు బంజారాహిల్స్ పోలీసులు గుర్తించారు.
ఈ నెల 14న కెన్యా నుంచి హైదరాబాద్కు వచ్చిన ఇబ్రహీంకు.. జీనోమ్ సీక్వెన్సింగ్ ఫలితాల్లో ఒమిక్రాన్ నిర్ధరణ అయింది. దీంతో ఆ వ్యక్తి చిరునామా కోసం మూడు రోజులుగా బంజారాహిల్స్ పోలీసులు, వైద్యారోగ్య శాఖ అధికారులు గాలిస్తున్నారు. ఒమిక్రాన్ రోగి అదృశ్యమయ్యాడంటూ గోల్కొండ ఎస్పీఎహెచ్ఓ అనురాధ.. ఇప్పటికే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన కొద్ది గంటలకే అతని ఆచూకీ లభ్యమైంది. బాధితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని వైద్యారోగ్య శాఖ అధికారులకు అప్పగించారు.
ఇదీ చదవండి:Omicron in Hanamkonda: 'ఒమిక్రాన్ బాధితురాలిలో ఎటువంటి లక్షణాలు లేవు.. కానీ జాగ్రత్త అవసరం'