మెదక్, నల్గొండ, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో చాలాచోట్ల తహసీల్దారు కార్యాలయాల్లో ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేశారు. ప్రతి కార్యాలయంలో మూడు పెట్టెలను తేదీల వారీగా తయారు చేసి ప్రత్యేక గదిలో భద్రపరుస్తున్నారు. అత్యవసరమైన దరఖాస్తులను మాత్రం స్కాన్ చేసి పంపించాలని సూచిస్తున్నారు.
తహసీల్దారు కార్యాలయాల్లో ఫిర్యాదుల పెట్టెలు.. ఎందుకంటే? - complaint boxes in medak district
కరోనా ఇప్పుడే తగ్గే సూచనలు కనిపించడం లేదు. అందుకే ప్రజలకు అందించే సేవలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా ఉండేందుకు కొందరు అధికారులు పలు చర్యలు చేపడుతున్నారు. తమను కలిసేందుకు వచ్చే అర్జీదారులు నిరాశ చెందకుండా ఉండేందుకు తమ కార్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటాన్ని దృష్టిలో పెట్టుకుని బాధితులను నేరుగా కలిసే క్రమంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
![తహసీల్దారు కార్యాలయాల్లో ఫిర్యాదుల పెట్టెలు.. ఎందుకంటే? Complaint boxes in tehsildar offices in telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8043466-72-8043466-1594864973606.jpg)
తహసీల్దారు కార్యాలయాల్లో ఫిర్యాదుల పెట్టెలు.. ఎందుకంటే?
‘‘మా మండలంలో రోజుకు పదికి పైగా దరఖాస్తులు వస్తుంటాయి. వీటికోసం ప్రత్యేకంగా పెట్టెను ఏర్పాటు చేశాం. దీనివల్ల బాధితులకు, సిబ్బందికి రక్షణ ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు వాట్సాప్ నంబర్లు, ఈమెయిల్ చిరునామాను ప్రజలకు అందుబాటులో ఉంచాం’’ అని మెదక్ జిల్లా అల్లాదుర్గం తహసీల్దారు సాయాగౌడ్ తెలిపారు.