ఏపీలోని కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలోని పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి మఠం పీఠాధిపతి కోసం బ్రహ్మంగారి వారసుల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఏడో తరానికి చెందిన పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా... నూతన పీఠాధిపతి ఎంపిక ప్రక్రియ విభేదాలకు దారితీసింది.
brahmamgari matham: పీఠాధిపతి కోసం బ్రహ్మంగారి వారసుల మధ్య ఆధిపత్య పోరు
ఏపీలోని కడప జిల్లా పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి మఠం పీఠాధిపతి కోసం బ్రహ్మంగారి వారసుల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. నూతన పీఠాధిపతి ఎంపిక ప్రక్రియ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారసుల మధ్య విభేదాలకు దారితీసింది.
మఠాధిపతిగా ఉన్న వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామికి ఇరువురు భార్యలు కాగా మొదటిభార్యకు నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. రెండో భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. స్వామి వారసులుగా తమకే మఠాధిపతిగా అవకాశం ఇవ్వాలని మొదటిభార్య సంతానం డిమాండ్ చేస్తోంది. తనకు వీలునామా రాసిచ్చారని రెండోభార్య తన వాదనను లేవనెత్తింది. వారసుల మధ్య విబేధాల నేపథ్యంలో డీఎస్పీ బి.విజయ్‌కుమార్, సీఐ కొండారెడ్డిలు ఇరువర్గాలను సర్దుబాటు చేసి సమన్వయం పాటించాలని సూచించారు. మఠాధిపతి ఎంపిక ప్రక్రియ ప్రాథమిక దర్యాప్తు చేస్తున్నామని... మరోసారి విచారణ చేసి నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొన్నారు. అంతవరకు మఠంలో యథావిధిగా పూజలు చేయాలని కోరారు.
ఇదీ చూడండి:police treatment: వింటారా..? ఐసోలేషన్‌లో ఉంటారా..?