హైదరాబాద్ గోల్నాకలోని ఫంక్షన్‌హాల్ గోడ కూలిన ఘటనపై మేయర్ బొంతు రామ్మోహన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన నలుగురి కుటుంబ సభ్యులకు ఒక్కోక్కరికి రూ.రెండు లక్షల పరిహారం ప్రకటించారు. గాయాలపాలైన వారికి వెంటనే మెరుగైన చికిత్స అందించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని జోనల్ కమిషనర్లను బొంతు రామ్మోహన్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే గ్రేటర్లో గుర్తించిన శిథిల భవనాలను వెంటనే ఖాళీ చేయించి... సమీపంలోని కమ్యూనిటీ హాళ్లలోకి ప్రజలను చేర్చాలని వెల్లడించారు.
గోల్నాక మృతుల్లో ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షలు పరిహారం - LATEST CRIME NEWS IN HYDERABAD
హైదరాబాద్‌లోని గోల్నాక ఫంక్షన్‌హాల్‌లో కూలిన ఘటనలో నలుగురు మృతి చెందారు. ఎనిమిది మంది తీవ్ర గాయాలు కాగా... క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు పరిహారాన్ని జీహెచ్‌ఎంసీ ప్రకటించింది.
Compensation for FUNCTIONAL WALL COLLAPSED died people IN HYDERABAD GOLNAKA