తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతు ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే కుట్ర: సాగర్ - Hyderabad latest news

దిల్లీలో రైతు ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోందని ప్రజాసంఘాల నేత సాగర్ ఆరోపించారు. రైతులకు మద్దతుగా బాగ్​లింగంపల్లిలోని సుందరయ్య పార్క్ వద్ద సత్యాగ్రహం చేపట్టారు.

Satyagraha of communities protesting against agricultural laws
వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ప్రజాసంఘాల సత్యాగ్రహం

By

Published : Jan 30, 2021, 7:43 PM IST

రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ప్రజాసంఘాల నేత టి.సాగర్ డిమాండ్​ చేశారు. రైతులపై కేంద్రం ఎంత కఠినంగా వ్యవహరించినా... ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. హైదరాబాద్ బాగ్​లింగంపల్లిలో సుందరయ్య పార్క్ వద్ద నేతలతో కలిసి సత్యాగ్రహం చేపట్టారు.

వ్యవసాయ, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని కోరుతూ దిల్లీలో చేస్తున్న ఆల్ ఇండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీలో ఎలాంటి చీలికలు లేవని టి.సాగర్ స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం.. దిల్లీలో రైతులపై దాడి, అక్రమ కేసులకు నిరసనగా గాంధీ వర్ధంతి సందర్భంగా సత్యాగ్రహం చేపట్టారు.

వ్యవసాయ పంటలకు మద్దతు ధర, ఎంఎస్పీ గ్యారెంటీ చట్టం చేయాలని డిమాండ్​ చేశారు. అన్నదాతల సమస్యల సాధనకు దేశంలోని ఐదు వందల రైతు సంఘాలు సంయుక్తంగా పోరాటం చేస్తున్నాయని పేర్కొన్నారు.

ఆల్ ఇండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ ఐక్యంగా ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. కమిటీని విచ్ఛిన్నం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వృథా ప్రయాసేనని పేర్కొన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా సత్యాగ్రహంతో పాటు సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details