కార్మికులకు సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకట్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం మేడే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులు సంఘటితమై తమని తాము రక్షించుకుంటూ.. ప్రపంచాన్ని పెట్టుబడిదారి వ్యవస్థ చేతిలో కూరుకుపోకుండా చూసుకోవాలని సూచించారు.
శ్రమజీవులకు చాడ, తమ్మినేని శుభాకాంక్షలు - కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్ రెడ్డి
కార్మికోలకానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మేడే శుభాకాంక్షలు తెలిపారు.

మేడే శుభాకాంక్షలు తెలిపిన కమ్యూనిస్టు నేతలు
అమరులైన కార్మికులకు జోహార్లు అర్పిస్తూ... వారి ఆశయాల సాధనకు నడుం బిగించాలన్నారు. ఉదయం 11 గంటలకు పార్టీ కార్యాలయాల వద్ద పార్టీ జెండాలు ఆవిష్కరించనున్నట్టు నేతలు తెలిపారు.
ఇదీ చూడండి: ప్రపంచంపై ఆగని కరోనా ప్రతాపం-రష్యాలో లక్ష కేసులు