తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ ఉద్యమ నేత బూర్గుల కన్నుమూత

ఆయన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో సైనికుడు. ప్రగతిశీల ఉద్యమానికి ఊపిరిలూదిన కామ్రేడ్. కమ్యూనిస్టు భావజాలాన్ని పుణికి పచ్చుకున్న ఉద్యమ నేత. అహర్నిశలూ పార్టీ సంక్షేమానికి పోరాడిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు బూర్గుల నర్సింగరావు ఇక లేరు. కరోనా బారిన పడి మృత్యువుతో పోరాడిన ఆయన.. సోమవారం తుది శ్వాస విడిచారు.

By

Published : Jan 18, 2021, 1:39 PM IST

burgula narsinga rao
బూర్గుల నర్సింగరావు

తెలంగాణ ఉద్యమ నేత బూర్గుల నర్సింగరావు కరోనాతో మృత్యువాత పడ్డారు. హైదరాబాద్​లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించారు. బూర్గుల మృతి పట్ల మంత్రి కేటీఆర్​, సీపీఐ నేతలు నారాయణ, సురవరం సుధాకర్​రెడ్డి, సాంబశివరావు, అజీజ్​ పాషా, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​ రెడ్డి, డిప్యూటీ కార్యదర్శి పల్లా వెంకట్​రెడ్డి, పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

తీరని లోటు

తెలంగాణ ఉద్యమంలో నర్సింగరావు సైనికుడిగా నిలబడ్డారని నారాయణ కొనియాడారు. కమ్యూనిస్టు ఉద్యమ పురోభివృద్ధిలో పెద్దదిక్కుగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని వ్యాఖ్యానించారు. నర్సింగరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

చిరస్మరణీయం

విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించిన యోధుడు బూర్గుల నర్సింగరావు అని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమం తొలిదశ నుంచి మలిదశ దాకా పోరాడారని పేర్కొన్నారు. ఆయన మరణం తెలంగాణకు తీరని లోటని వ్యాఖ్యానించారు. తెలంగాణకు బూర్గుల సేవలు చిరస్మరణీయమైనవని వెల్లడించారు.

ఇదీ చదవండి:తెలంగాణ విద్యుత్​ ఉద్యోగుల పనితీరు అద్భుతం : కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details