ముఖ్యమంత్రి కేసీఆర్ నవాబ్‌ల వ్యవహరిస్తున్నారని.. ప్రజా తిరుగుబాటు రాకముందే తన వైఖరి మార్చుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె అణిచివేతకు నిరసనగా వామపక్ష విప్లవ పార్టీలు, ప్రజా సంఘాలు సంయుక్తంగా హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలోనిర్బంధ వ్యతిరేక సభ నిర్వహించారు. దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజా ఉద్యమాలను అణిచివేయటమే లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్నారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు అండగా నిలుస్తామని భరోసానిచ్చారు. సమ్మెలో నిర్మాణాత్మకమైన పోరాటం కొనసాగించాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.
'ప్రజాఉద్యమం రాకముందే మేల్కొండి' - Communist Parties meeting at Baglingampally
రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులు, అణిచివేతకు నిరసనగా వామపక్ష విప్లవ పార్టీలు, ప్రజా సంఘాలు సంయుక్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో నిర్భంద వ్యతిరేక సభను నిర్వహించాయి.

'ప్రజాఉద్యమం రాకముందే మేల్కొండి'