ఈ ఏడాది జూన్ 16 నుంచి 24వ తేదీ మధ్య నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించి, వర్షాలు విస్తారంగా కురవడానికి వాతావరణం అనుకూలంగా ఉందని పోట్స్ట్యామ్ ఇన్‌స్టిట్యూట్ రీసెర్చ్ గ్రూప్ లీడర్ ఆఫ్ జర్మనీ ప్రొఫెసర్ ఎలీనా సురోవ్యాట్కీనా పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఈ ఏడాది విస్తారంగా వర్షాలు - common rainfall in telangana state
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించి, వర్షాలు విస్తారంగా కురిసే అవకాశముందని పోట్స్ట్యామ్ ఇన్‌స్టిట్యూట్ రీసెర్చ్ గ్రూప్ లీడర్ ఆఫ్ జర్మనీ ప్రొఫెసర్ తెలిపారు. ఈ దఫా రాష్ట్రంలో 854 మి.మీ సాధారణ వర్షపాతం నమోదవుతుందన్నారు.

రాష్ట్రంలో ఈ ఏడాది విస్తారంగా వర్షాలు
ఆచార్య జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయంలో గురువారం ఉపకులపతి వి.ప్రవీణ్‌రావు ఆధ్వర్యంలో ‘ఫోర్ క్యాస్ట్ ఆఫ్ మాన్సూన్ అనౌన్స్-2020 సెంట్రల్ ఇండియా అండ్ తెలంగాణ’ అంశంపై వెబినార్ లెక్చర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలీనా వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ దఫా తెలంగాణలో 854 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదవుతుందన్నారు.
ఇవీ చూడండి:ఆ అడవి నాదే..ఈ నగరం నాదే.