తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్​ విడుదల - ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష

ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్​ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈసారి అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో ఒకే పరీక్షను నిర్వహిస్తున్నట్లు విద్యామండలి ఛైర్మన్​ పాపిరెడ్డి తెలిపారు. మే 30 తుది గడువు కాగా.. జూన్​ 14 నుంచి ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

పీజీ ఈసెట్​

By

Published : Apr 29, 2019, 6:48 PM IST

ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్​ను ఉన్నత విద్యామండలి ఛైర్మన్​ పాపిరెడ్డి విడుదల చేశారు. ఈ ఏడాది అన్ని వర్శిటీల పరిధిలోని సీట్ల భర్తీకి ఒకే పరీక్ష నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. విద్యార్థుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని... యూనివర్శిటీల మధ్య ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. పరీక్షల నిర్వహణ బాధ్యతను ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఉమ్మడి పీజీ సెట్​ నోటిఫికేషన్​ విడుదల

మే 30 తుది గడువు

ఉమ్మడి పీజీ సెట్​ దరఖాస్తుకు మే 30న తుది గడువుగా నిర్ణయించారు. ఓసీ, బీసీలకు పరీక్ష ఫీజు రూ. 800, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్​సీ అభ్యర్థులకు రూ.600 వసూలు చేస్తామని ఓయూ వీసీ రామచంద్రం తెలిపారు. 500 రూపాయల ఆలస్య రుసుముతో జూన్​ 8 వరకు, 2000 రూపాయలతో జూన్​ 11 వరకు అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. దాదాపు 30 వేల సీట్ల భర్తీకి 25 కేంద్రాల్లో ఆన్​లైన్లో పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. జూన్​ 14 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి : పోలీసుల నిర్బంధంతో ఉద్యమాలను ఆపలేరు: చాడ

ABOUT THE AUTHOR

...view details