మానవులు, అడవి జంతువుల మధ్య ఘర్షణను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. అటవీశాఖ మంత్రి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసిన సర్కారు... సభ్యులుగా రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డిని నియమించింది.
నిపుణులు అనిల్ ఏపూర్, ఇమ్రాన్ సిద్దిఖీ, నవీన్ కుమార్, రాజీవ్ మ్యాథ్యూతో పాటు, ఎన్టీసీఏ ప్రతినిధి, పీసీసీఎఫ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. పులులు... మనుషులను చంపకుండా తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ సూచనలు చేయనుంది. మనుషులు, అడవి జంతువుల మధ్య ఘర్షణ నివారించే చర్యలతో పాటు మానవాళి, పెంపుడు జంతువులు, పంటల నష్టాన్ని అంచనా వేసేందుకు విధివిధానాలను కమిటీ రూపొందించనుంది.