ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై నిజానిజాలు వెలికితీసేందుకు నియమించిన త్రిసభ్య కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. తమపై ఎటువంటి ఒత్తిళ్లు లేవని కమిటీ ఛైర్మన్ వెంకటేశ్వరరావు తెలిపారు. భవిష్యత్లో తీసుకోవాల్సిన చర్యలను కూడా నివేదికలో పేర్కొన్నామని వెల్లడించారు. నివేదిక ప్రభుత్వ పరిశీలనలో ఉందని, దానిపై చర్చించి తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ఇంటర్ తప్పులకు ఇద్దరూ బాధ్యులే: త్రిసభ్య కమిటీ
ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలకు ఇంటర్మీడియట్ బోర్డు, గ్లోబరీనా సంస్థ రెండూ బాధ్యత వహించాలని త్రిసభ్య కమిటీ తెలిపింది. 10 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
త్రిసభ్య కమిటీ