గణేశ్ నిమజ్జనం సందర్భంగా రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ కాప్రా, సఫీల్ గూడ, రాంపల్లి చెరువులను సందర్శించారు. అనంతరం గణేశ్ పూజలో పాల్గొన్నారు. భక్తులు ఆటపాటలతో గణనాథులకు చెరువు వద్ద ఘన స్వాగతం పలికారు. రాచకొండ పరిధిలో సుమారు 6 వేల మంది సిబ్బంది పోలీసులతో బందోబస్తును నిర్వహిస్తున్నామని భగవత్ పేర్కొన్నారు. కాప్రా, సఫీల్ గూడ చెరువుల వద్ద 10 వరకు భారీ క్రేన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. వదంతులేవీ నమ్మవద్దని నిమజ్జనాల వద్ద ఎలాంటి సమస్య ఉన్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. నిమజ్జనాలు రేపు ఉదయం వరకు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
కాప్రా, రాంపల్లి చెరువులను సందర్శించిన సీపీ మహేశ్ భగవత్ - రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్
హైదరాబాద్ ఈసీఐల్, కాప్రా పరిధిలోని చెరువుల్లో జరుగుతున్న గణేశ్ నిమజ్జనాల తీరును రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ పరిశీలించారు. నిమజ్జనంలో భాగంగా గణేశ్ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గణేశ్ నిమజ్జన భద్రతా చర్యలను పర్యవేక్షించిన రాచకొండ కమిషనర్