దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న వాణిజ్య పన్నుల శాఖను పునర్వ్యవస్థీకరణను ఆమోదించి... అమలు చేయడంపై కమర్షియల్ ట్యాక్స్ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు.
సీఎస్‌ను కలిసిన కమర్షియల్ ట్యాక్స్ గెజిటెడ్ అధికారుల సంఘం - ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను... కమర్షియల్ ట్యాక్స్ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రతినిధులు శాలువ కప్పి సన్మానం చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో సంస్కరణలతో పాటు, విస్తరణ చేపట్టడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.
సీఎస్‌ను కలిసిన కమర్షియల్ ట్యాక్స్ గెజిటెడ్ అధికారుల సంఘం
మర్యాద పూర్వకంగా సోమేశ్‌కుమార్‌ను కలిసి సన్మానం చేశారు. ప్రభుత్వ పాలనలో అన్ని శాఖల్లో సమూల సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వం, వాణిజ్య పన్నుల శాఖలో సంస్కరణలతో పాటు, విస్తరణ చేపట్టడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. అలాగే శాఖలోని సమస్యలను కూడా పరిష్కరించి, ఉద్యోగులందరి సంక్షేమం కోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి:రికరింగ్ సొమ్మును యాదాద్రి దేవస్థానం చెల్లించాల్సిందే: కేటీఆర్