తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎన్టీఆర్​పై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి' - జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020

మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన అనుచిత వ్యాఖ్యలను టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఖండించింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌ ముందు అక్బర్​, అసద్​లకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టింది.

'ఎన్టీఆర్​పై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి'
'ఎన్టీఆర్​పై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి'

By

Published : Nov 25, 2020, 9:45 PM IST

దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ వెంటనే ఉపసంహరించుకోవాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జయరామ్‌ డిమాండ్ చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌ ముందు టీఎన్‌ఎస్‌ఎఫ్‌... అక్బరుద్దీన్‌, అసదుద్దీన్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు.

ఈ సందర్భంగా ఎంఐఎం నేతలు అక్బర్, అసద్‌ల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు.

ఇదీ చూడండి:దమ్ముంటే సమాధులు కూల్చండి: అక్బరుద్దీన్

ABOUT THE AUTHOR

...view details