తెలంగాణ

telangana

ETV Bharat / state

భారత్​ బయోటెక్​ కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం

భారత్​ బయోటెక్​ కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం
భారత్​ బయోటెక్​ కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం

By

Published : Jul 17, 2020, 8:04 PM IST

Updated : Jul 17, 2020, 9:23 PM IST

20:02 July 17

దేశవ్యాప్తంగా స్వదేశీ కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం

భారత్​ బయోటెక్​ సంస్థ ట్వీట్​

కరోనాకు దేశీయంగా తొలి వ్యాక్సిన్‌ తయారీలో ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ మరో ముందడుగు వేసింది. తాము అభివృద్ధి చేస్తున్న.. "కొవాగ్జిన్‌" టీకా మొదటి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించినట్టు భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది. దేశంలోని పన్నెండు ప్రాంతాల్లో తొలిదశ క్లినికల్‌ ట్రయల్స్‌.. ఈనెల 15న ప్రారంభించినట్టు భారత్‌ బయోటెక్‌... ఆ ప్రకటనలో వెల్లడించింది. మొత్తం 375 మందితో తొలిదశ క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టినట్టు వివరించింది. 

దేశంలోని 12 ప్రాంతాల్లో... హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రి కూడా ఉంది. భారత వైద్య పరిశోధనా మండలి-ఐసీఎంఆర్​, పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ వైరాలజీ-ఎన్​ఐవీ సహకారంతో.. భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ కోవాగ్జిన్‌ టీకాను అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం సార్స్‌, కోవ్‌-2 వైరస్‌ స్ట్రెయిన్‌ను నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ వైరాలజీ.. భారత్‌ బయోటెక్‌కు బదిలీ చేసింది. అనంతరం హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్‌కు చెందిన బయో సేఫ్టీ లెవల్-3 ప్రయోగశాలలో.. టీకాను తయారు చేశారు. కోవాగ్జిన్‌ మొదటి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు ఇప్పటికే.. భారత ఔషధ నియంత్రణ మండలి-డీసీజీఐ అనుమతి ఇచ్చింది.

Last Updated : Jul 17, 2020, 9:23 PM IST

ABOUT THE AUTHOR

...view details