తెలంగాణ

telangana

ETV Bharat / state

Special Story On Dundigal AIR Force Academy : 'దేశ సేవ చేయడమే మా అంతిమ లక్ష్యం' - AIR Force Academy News

Dundigal AIR Force Academy : త్రివిధ దళాలలో వైమానిక దళం అందిస్తున్న సేవలు ఎంతో కీలకమైనవి. అనునిత్యం అప్రమత్తంగా ఉండటమే కాక, దేశ భూభాగాన్ని గగన తలం నుంచే రక్షిస్తూ మిగిలిన దళాలను అప్రమత్తం చేస్తుంది వాయుసేన. ప్రకృతి విపత్తులను, సవాళ్లను ఓ వైపు ధీటుగా ఎదుర్కొంటూనే, మరోవైపు దేశ రక్షణలో అత్యంత కీలకమైన బాధ్యత పోషిస్తోంది. అలాంటి ప్రతిష్ఠాత్మక రంగంలోకి మేము సైతం అంటూ ముందుకు వస్తున్నారు ఆ యువతి, యువకులు. కలల సాధనకు దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొంది.. దేశ సేవకు సిద్ధమైన ఆ యువ వాయుసేన అధికారులపై ఈటీవీ భారత్ కథనం.

Special Story On Dundigal AIR Force Academy
Special Story On Dundigal AIR Force Academy

By

Published : Jun 23, 2023, 1:25 PM IST

'దేశ సేవ చేయడమే మా అంతిమ లక్ష్యం'

Dundigal AIR Force Academy Special Story :వీరంతా భారత త్రివిధ దళాలలో అత్యంత కీలకమైనవాయుసేనకు సేవలందించడానికి సిద్ధం అయ్యారు. మరి, ఇలాంటి వ్యవస్థలో పని చేయాలంటే దేశ భక్తితో పాటు సాంకేతిక నైపుణ్యం చాలా అవసరం. వాటన్నింటినీ పట్టుదలతో సాధన చేసి సంపాదించుకున్నారు ఈ యువతి, యవకులు. దేశం కోసం గగనతలంలో గస్తీ కాస్తూ.. శత్రువుల దాడులను పసిగట్టి చెక్ పెట్టడమే మా ముందున్న లక్ష్యమంటున్నారుఈ వాయుసేన అధికారులు.

Combined Graduation Parade in Hyderabad : హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఈ ఏడాది క్యాడెట్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇందులో 119 మంది ఫ్లైయింగ్ ఎయిర్, 75 మంది గ్రౌండ్ డ్యూటీ విభాగాల్లో ప్రతిభ, నైపుణ్యాలు సంపాదించారు. వీరందరికి కంబైన్డ్‌ గ్యాడ్యుయేషన్‌ పరేడ్‌ నిర్వహించింది దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ. ఈ పరేడ్‌కు రివ్యూయింగ్‌ ఆఫీసర్‌గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు.

Dundigal Air Force Academy :దేశ సరిహద్దుల్లో గగనతలాన్ని రక్షించేందుకు ఉవ్విళ్లురుతున్న క్యాడెట్లు కొందరైతే, తండ్రి, తాతాల ప్రోత్సాహంతో ఎయిర్‌ఫోర్స్‌పై అమితంగా ఆశక్తి ఉన్నవాళ్లు మరొకరు ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. కానీ అందరి అలోచన ఒక్కటే తనకొచ్చిన ఈ అవకాశం దేశ సేవకు వినియోగించాలని. పాసింగ్ అవుట్ పరేడ్‌లో క్యాడెట్ల నుంచి ఆఫీసర్‌గా మారే పిప్పెట్ సెర్మనీ సమయంలో క్యాడెట్లు భావోద్వేగానికి లోనయ్యారు.

"తండ్రి ప్రోత్సాహంతో సైనిక్‌ స్కూల్‌లో చేరాను. అక్కడి నుంచి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరి ఎయిర్‌ ఫోర్స్ వైపు వెళ్లాను. తండ్రి ఆశయం సాకారం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎయిర్​ఫోర్స్ అధికారి అవ్వడం చాలా గర్వంగా అనిపిస్తోంది". -నిఖిల్ సాయి యాదవ్, ఫ్లైయింగ్ ఆఫీసర్

AIR Force Academy in Dundigal :తండ్రి ప్రోత్సాహంతో సైనిక్‌ స్కూల్‌లో చేరానని వనపర్తికి చెందిన నిఖిల్ సాయి యాదవ్ చెబుతున్నాడు. అక్కడి నుంచి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరి ఎయిర్‌ ఫోర్స్ వైపు అడుగులు వేశానని.. తండ్రి ఆశయం సాకారం చేసినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఎయిర్​ఫోర్స్ అధికారి అవ్వడం చాలా గర్వంగా ఉందని నిఖిల్ అంటున్నాడు.

Graduation Of Indian Air Force Cadets :తల్లి ఎంతో కష్టపడి తమని పెంచి పెద్ద చేసిందని.. చిన్ననాటి నుంచి ఉన్న కల నెరవేరిందని గుంటూరుకు చెందిన తాళ్లూరి సందీప్ కుమార్ చెబుతున్నాడు. ఇండియన్ ఎయిర్​ఫోర్స్ నిర్వహించే ఆఫ్‌క్యాట్ పరీక్ష ద్వారా ఎయిర్​ఫోర్స్‌లోకి చేరాడు ఈ యువకుడు. పరేడ్‌లో రాష్ట్రపతి పాల్గొనడం చాలా గర్వంగా అనిపించిందని అంటున్నాడు.

ఎయిర్​ఫోర్స్​ అధికారిగా చూడాలి: 7వ తరగతి చదువుతున్న సమయం నుంచి తల్లిదండ్రులు తనని ఎయిర్‌ఫోర్స్ అధికారిగా చూడాలనుకున్నారని హరియాణకి చెందిన నితేశ్ ఝెకర్ చెబుతున్నాడు.అందుకు తగినట్లే తాను అడుగులు వేసి.. ఫ్లైయింగ్ బ్యాచ్‌లో టాపర్‌గానిలిచానని అంటున్నాడు. తాతను స్ఫూర్తిగా తీసుకుని ఫైయింగ్ అధికారి అయ్యింది అదే హరియాణకు చెందిన మనీషా. గ్రౌండ్ డ్యూటీ విభాగంలో ప్రతిభ కనబరచి రాష్ట్రపతి ద్వారా పతకాన్ని అందుకుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉండటం తనకు ఎంతో గర్వంగా ఉందని అంటుంది.

"మా తల్లిదండ్రులు నన్ను ఎయిర్​ఫోర్స్ అధికారిగా చూడాలనుకున్నారు. అందుకు తగ్గట్లుగానే నా అడుగులు వేశాను. ప్రస్తుతం ఫ్లైయింగ్ బ్యాచ్​లో టాపర్​గా నిలిచాను". -నితేశ్ ఝెకర్, ఫ్లైయింగ్ ఆఫీసర్

CGP At AIR Force Academy Dundigal In Hyderabad :చిన్నప్పటి నుంచి తండ్రిని ఆర్మీ యూనిఫారమ్‌లో చూసి తాను కూడా దేశ సేవలో భాగం కావాలనుకుంది ఉత్తరప్రదేశ్‌కు చెందిన వర్ష యాదవ్. ఎయిర్​ఫోర్స్‌లో చేరడం చాలా సంతోషంగా ఉందని.. ప్రస్తుతం గ్రౌండ్ డ్యూటీ అధికారిగా వాతావరణ విభాగంలో అవకాశం వచ్చింది. సాయుధ బలగాల్లోకి మహిళలు రావడానికి మంచి అవకాశాలు ఉన్నాయని చెబుతుంది.

Special Story On AIR Force Academy : ప్రస్తుతం దుండిగల్ ఎయిర్​ఫోర్స్ స్టేషన్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న ప్లైయింగ్, గ్రౌండ్ డ్యూటీ అధికారులు.. తదుపరి శిక్షణకు వారి వారి విభాగాల్ని బట్టి ఇతర అకాడమీల్లో శిక్షణ పొందనున్నారు. ఏటా 200ల నుంచి 400 మంది వరకు క్యాడెట్లను భారత వాయుసేనకు ఈ అకాడమీ అందిస్తుంది.

"చిన్నప్పటి నుంచి మా నాన్నను ఆర్మీ యూనిఫారమ్​లో చూసి నేను కూడా దేశ సేవలో భాగం కావాలి అనుకున్నాను. ఎయిర్​ఫోర్స్​లో చేరడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం నాకు గ్రౌండ్​ డ్యూటీ అధికారిగా వాతావరణ విభాగంలో అవకాశం వచ్చింది". -వర్ష యాదవ్, ఫ్లైయింగ్ ఆఫీసర్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details