తెలంగాణ లైఫ్ సైన్సెస్ సక్సెస్ స్టోరీ అధ్యయనం కొరకు కొలంబియా దేశ ప్రతినిధులు భాగ్యనగరంలో పర్యటించారు(Columbian delegation team visit hyderabad). కొలంబియా ఆరోగ్య, సామాజిక రక్షణశాఖ మంత్రి ఫెర్నాండో రూయిజ్, ఆదేశ శాస్త్రసాంకేతికశాఖ మంత్రి సెర్జియో క్రిస్టాన్చో నేతృత్వంలోని హైలెవల్ కొలంబియా బృందం హైదరాబాద్‌లోని జీనోం వ్యాలీని (Columbian team visit hyderabad genome valley) సందర్శించింది. ఈ బృందంలో మంత్రులు, ఆ దేశ రాయబారి మారియానా పాచెకోతోపాటు మొత్తం 34 ప్రతినిధుల బృందం పాల్గొంది.
ఇరు దేశాల మధ్య వ్యాపార ఒప్పందాల కోసమే..
ఫార్మా, లైఫ్ సెన్సెస్ రంగంలో హైదరాబాద్... ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టంలో హైదరాబాద్ చూపుతున్న చొరవ, ప్రతిభే తమను హైదరాబాద్ సందర్శించేలా చేసిందని కొలంబియా ప్రతినిధుల బృందం పేర్కొంది. హైదరాబాద్ కేంద్రంగా భారీగా ఔషధాలు, వ్యాక్సిన్ల తయారీకి గల సానుకూలతలు, నియంత్రణ సంస్థల పనితీరుపై మరింత లోతుగా అధ్యయనం చేస్తామని తెలిపారు. వాటితో పాటు తమ దేశ కంపెనీలు, సంస్థలతో ఇక్కడి సంస్థలు, కంపెనీలతో వ్యాపార ఒప్పందాలు చేసుకోవడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. ఈ క్రమంలోనే పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను కొలంబియా బృందం కలిసింది. రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ అభివృద్ధి పట్ల మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని టీంపై ప్రశంసలు కురిపించింది.
మంత్రి కేటీఆర్‌తో కొలంబియా ప్రతినిధి బృందం భేటీ