Colour Utsav Mela At Necklace Road సాగర తీరంలో శ్రీహరికోట చంద్రయాన్ 3 కలర్స్ ఉత్సవ మేళాలో ఎన్నెన్ని వింతలో Colour Utsav Mela At Necklace Road Hyderabad :హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో కలర్స్ ఉత్సవ్ మేళా ఏర్పాటు చేశారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు కావాల్సిన విందు, వినోదం, విజ్ఞానం.. ఇలా అన్నీ రకాలైన సౌకర్యాలతో అద్భుతంగా తీర్చిదిద్దారు. చంద్రయాన్-3నమూనా, శ్రీహరికోట నమూనాలు ఈ మేళాలో కళ్లకు కట్టినట్టుగా రూపొందించారు. సందర్శకులు వీటిని చూస్తూ.. సరికొత్త అనుభూతిని పొందుతూ.. సెల్‌ఫోన్‌లో సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.
Hyderabad Colour Utsav Mela :లోపకి వెళ్లగానే.. అక్కడ విక్రమ్ ల్యాండర్, దాని లోపలి నుంచి బయటకు వచ్చి ప్రగ్యాన్ రోవర్ చంద్రుడిపై అడుగుపెట్డడం వంటి దృశ్యాలు వీక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాయి. అటు నుంచి కొంచెం ముందుకు వెళ్లగానే విభిన్న రకాలైన ఏలియన్స్ సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం తర్వాత నగరవాసులకు దానికి స్వయంగా వీక్షించే విధంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేసినట్లు కలర్స్ ఉత్సవ్ మేళా నిర్వాహకులు చెబుతున్నారు.చంద్రయాన్-3 భూమి నుంచి చంద్రుని వరకు జరిగే ప్రయాణాన్ని కళ్ల ముందు జరిగినట్లుగా ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెబుతున్నారు. రాకెట్లను ఎలా ప్రయోగిస్తారో అదే నమూనాగా ఇందులో మూడు రాకెట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని తెలిపారు.
Chandrayaan 3 : చంద్రుడిపై ఆక్సిజన్, సల్ఫర్‌లతో పాటు మరిన్ని మూలకాలు.. వెల్లడించిన ఇస్రో
Chandrayaan 3 Design at Hyderabad Colors Utsav Mela :చందమామను అతి దగ్గరా చూసేందుకు ఓ నమూనా తయారు చేశారని.. ఇక్కడ పలు రకాలైన ఏలియన్స్‌ను చూస్తుంటే అశ్చర్యం వేస్తుందని సందర్శకులు అంటున్నారు. త్రీడి సౌండ్ ఎఫెక్ట్‌తో కదిలే విధంగా ఏర్పాటు చేయడం మరింత సంతోషంగా ఉందని చెబుతున్నారు. నగరంలో ఇప్పటి వరకు ఇలాంటి ఎగ్జిబిషన్‌ను చూడలేదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిబిషన్ అంటే కేవలం వస్త్రాభరణాలు, తినుబండారలు మాత్రమే ఉంటాయని అనుకునే వాళ్లమని...ఈ ప్రదర్శన వినోదంతో పాటు విజ్ఞానం అందించే విధంగా ఏర్పాటు చేశారని తెలిపారు. చంద్రయాన్ ప్రయోగం కేవలం టీవీలో మాత్రమే చూశామని.. ఇక్కడ స్వయంగా చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని అన్నారు.
ఉత్సవ్ మేళాలో భాగంగా ఏర్పాటు చేసిన అండర్ వాటర్ టన్నెల్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు అక్వేరియంలోని రంగురంగుల చేపలను వీక్షించేందుకు ప్రజలు బారులు తీరుతున్నారు. సముద్రం అడుగుభాగంలో జీవించే వింతైన జీవరాశులు ఇక్కడ కనువిందు చేస్తున్నాయి. ఇంకా షాపింగ్ చేసేందుకు ప్రముఖ రియల్ ఏస్టేట్ చెందిన స్టాల్స్, గార్మెంట్స్, హ్యాండ్‌లూమ్, జ్యూయలరీ, కాస్మోటిక్స్ కశ్మీరి డ్రైప్రూట్స్, పుట్‌వేర్, థ్రిలింగ్ గేమ్స్ తో పాటు జ్యూస్, ఫాస్ట్‌పుడ్, కూల్ డ్రింక్స్, వెరైటీ పాప్‌కార్న్ తదితర ఉత్పత్తులు కొలువుదీరాయి.
Chandrayaan 3 Latest Update : చంద్రుడిపై దుమ్మురేపిన విక్రమ్ ల్యాండర్.. ఏకంగా 2 టన్నుల మట్టి గాలిలోకి..
Chandrayaan Ganesh in Kamareddy : కామారెడ్డిలో చంద్రయాన్-3 గణేశ్.. సెల్ఫీలతో భక్తుల సందడి