దేశ సరిహద్దుల్లో అమరుడైన కల్నల్ సంతోశ్ బాబు అంత్యక్రియలు... సూర్యాపేట జిల్లా కేసారంలో గురువారం జరగనున్నాయి. గురువారం(రేపు) ఉదయం కేసారంలోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వ్యవసాయ క్షేత్రంలో ఇందుకుగాను అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈరోజు సాయంత్రం కల్నల్ భౌతికకాయం సూర్యాపేటలోని ఆయన స్వగృహానికి చేరనుంది.
కల్నల్ సంతోశ్ అంత్యక్రియలకు సూర్యాపేటలో ఏర్పాట్లు
చైనా - భారత్ సరిహద్దుల్లో ఇరు దేశాల మిలటరీ మధ్య జరిగిన ఘర్షణల్లో వీరమరణం పొందిన కల్నల్ సంతోశ్ బాబు అంత్యక్రియలు సూర్యాపేట జిల్లా కేసారంలో గురువారం ఉదయం జరగనున్నాయి. కేసారంలోని వ్యవసాయ క్షేత్రంలో తుది ఘట్టానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
కేసారం వ్యవసాయ క్షేత్రంలో కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలు.... అధికారుల ఏర్పాట్లు
ఉదయం నిర్వహించే తుది ఘట్టానికి ముందు సందర్శనార్థం భౌతిక కాయాన్ని ఉంచాలన్న అభిప్రాయం వినపడుతోంది. ప్రజల సందర్శనార్థం పార్థివ దేహాన్ని ఎక్కడ ఉంచాలనే అంశంపై అధికారులు చర్చిస్తున్నారు.
ఇదీ చూడండి:ఆరు దశాబ్దాల నాటి ప్లాన్‌తోనే భారత్‌పై చైనా గురి!