College Staff Election Campaign in Telangana :విద్యార్థులూ (ఓటర్లూ).. కాన్సెప్ట్ (మేనిఫెస్టో)ను అందరూ బాగా అర్థం చేసుకోండి. ఎవరికైనా ఏమైనా సందేహాలుంటే అడగండి. పరీక్ష (ఈవీఎం)లో అన్నింటిని చూసి సరైన సమాధానాన్ని (మా అభ్యర్థిని) గుర్తించండి (ఓటు వేయండి).. ప్రస్తుతం కొన్ని కళాశాలలో అధ్యాపకుల బోధన ఇలా సాగుతోంది. కళాశాలలే వేదికగా తమ ప్రచారాన్ని చేస్తున్నాయి కొన్ని పార్టీలు. కాగా యువ ఓటర్లకు తమదైన శైలీలో ప్రచారం చేస్తున్నారు అధ్యాపకులు.
ఎందుకంటే.. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులుగా పలు ఇంజినీరింగ్, వైద్య కళాశాలల అధిపకులు ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో.. వారి తరఫున ఆయా కళాశాలల టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రచారంలో తలమునకలవుతున్నారు. కాలేజీ యజమానుల ఆదేశంలోనియోజకవర్గాల్లో ప్రచారంలో తిరుగుతున్నారు. ప్రచార ప్రణాళికను రూపొందించడం.. కార్యాలయాల నిర్వహణ.. జనం నాడిని పరిశీలించడం.. పార్టీలోని అసంతృప్తి నేతలను గమనించడం.. ప్రచారంలో పాల్గొనడం.. ప్రచారానికైనా రోజువారీ ఖర్చులను నమోదు చేయడం.. డబ్బుల పంపిణీ చేయడం వంటి పనులను చేస్తున్నారు.
Private College Staff During Election Campaign : హయత్నగర్ ప్రాంతంలోని ఓ కాలేజీ యజమాని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. దీంతో ఆ కాలేజీ నాన్ టీచింగ్ సిబ్బందితోపాటు అధ్యాపకులు సైతం మెడలో పార్టీల జెండాలు వేసుకొని గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ.. కరపత్రాలు పంచిప్రచారాలు చేస్తున్నారు. జనగామలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరూ ఇంజినీరింగ్ కళాశాలల యజమానులే. దీంతో వారి సొంత సిబ్బంది సైతం నియోజకవర్గంలోని ఎన్నికల వ్యవహారాలను చూసుకుంటున్నట్లు సమాచారం.
పోలింగ్ ఎప్పుడొచ్చినా పోరు పతాక స్థాయిలోనే - రంగారెడ్డి జిల్లాలో రాజకీయ వాతావ'రణం' ఎలా ఉందంటే?