జీహెచ్‌ఎంసీ(GHMC)లో సూపర్ స్ప్రెడర్ల(super spreader)కు వ్యాక్సినేషన్(Vaccination) సజావుగా సాగుతోందని హైదరాబాద్(hyderabad) కలెక్టర్ శ్వేతా మహంతి తెలిపారు. కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేసినట్లు... మూడు రోజుల్లో వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ కోసం అదనపు సిబ్బందిని కేటాయించినట్లు పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 30 సెషన్లు కాకుండా హైదరాబాద్‌లో మరో 18 ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
super spreader: 'సజావుగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్'
జీహెచ్‌ఎంసీ పరిధిలో సూపర్ స్ప్రెడర్ల(super spreader)కు వ్యాక్సినేషన్(vaccination) కొనసాగుతోందని హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి వెల్లడించారు. కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వ్యాక్సినేషన్ కోసం అదనపు సిబ్బందిని కేటాయించినట్లు పేర్కొన్నారు.
టీకా పంపిణీ, సూపర్ స్రెడర్లు
ప్రతి కేంద్రంలో వ్యాక్సినేషన్ రూం, వెయింటింగ్ రూం, అబ్జర్వేషన్ రూంలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్(CM KCR), సీఎస్(CS) సోమేశ్‌కుమార్ ఆదేశాలకు అనుగుణంగా టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. మరింత సమాచారం తెలుసుకునేందుకు కలెక్టర్ శ్వేతా మహంతితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చదవండి: Vaccination: సూపర్ స్ప్రెడర్ల కోసం వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాలు