ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య చుక్కా లక్ష్మీబాయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీఎల్‌బీ సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్ష విజేతలకు అవార్డులు ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు అవార్డులు అందజేశారు. విద్యా రంగంలో మంచి ఫలితాలు ఎలా సాధించాలి అనే విషయాలపై విద్యార్థులకు ఆమ్రపాలి పలు సూచనలు ఇచ్చారు.
గత 10 ఏళ్ల నుంచి
అవార్డుల ప్రధానోత్సవం గత 10 సంవత్సరాల నుంచి చుక్కా రామయ్య సతీమణి లక్ష్మీ బాయమ్మ పేరిట సీఎల్‌బీ పౌండేషన్ వారు నిర్వహిస్తున్నారు. తన భార్య పేరిట నిర్వహిస్తున్న నిర్వాహకులను ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్య అభినందించారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా మెరుగైన విద్యార్థులను తయారు చేస్తున్నారని కొనియాడారు.