తెలంగాణ

telangana

ETV Bharat / state

వంద శాతం పన్ను వసూళ్లే లక్ష్యంగా ప్రభుత్వ కార్యాచరణ - ghmc

రాష్ట్రంలోని పురపాలికల్లో వందశాతం పన్నుల వసూళ్లే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోంది. మార్చి నెలాఖరు వరకు రూ. 499 కోట్ల మేర ఆస్తిపన్ను వసూలైంది. మొత్తం అంచనాలో ఇది 77.82 శాతం.

వంద శాతం పన్ను వసూళ్లే లక్ష్యంగా ప్రభుత్వ కార్యాచరణ
వంద శాతం పన్ను వసూళ్లే లక్ష్యంగా ప్రభుత్వ కార్యాచరణ

By

Published : May 10, 2020, 12:04 AM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్​తో పాటు ఇతర నగరపాలక, పురపాలక సంస్థల్లో ఆస్తి పన్ను వసూళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. రాష్ట్రంలో అన్ని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లోనూ వంద శాతం పన్నుల వసూలే లక్ష్యంగా పురపాలకశాఖ అవసరమైన చర్యలు తీసుకుంటోంది. జీహెచ్ఎంసీ మినహా కార్పొరేషన్లు, పురపాలికల్లో మార్చి నెలాఖరు వరకు రూ. 499 కోట్ల మేర ఆస్తిపన్ను వసూలైంది. మొత్తం అంచనాలో ఇది 77.82 శాతం.

8లక్షల మందికి పైగా వినియోగం...

ఆస్తి పన్ను వసూళ్లకు గడువు పొడిగించాక ఇప్పటి వరకు మొత్తం రూ.506 కోట్లతో 78.96 శాతానికి చేరుకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఐదు శాతం రిబేట్​ను ఎనిమిది లక్షల మందికి పైగా వినియోగించుకున్నారు. రిబేటు పద్ధతిలో రూ.14.29 కోట్లు వసూలయ్యాయి. రూ. 21 కోట్ల బకాయిలు వసూలయ్యాయి.

వాటిల్లో 100 శాతం వసూళ్లు !

గత ఏడాది 89 శాతం ఆస్తిపన్ను వసూలైంది. ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటికే కోదాడ, కోరుట్ల, కొడంగల్ పురపాలికల్లో ఆస్తిపన్ను వంద శాతం వసూలైంది. 19 పట్టణాల్లో 90 శాతానికి పైగా, 37 పట్టణాల్లో 80 శాతానికి పైగా ఆస్తిపన్ను వసూలు చేశారు.

ఐదు శాతం ఎర్లీబర్డ్ ప్రోత్సాహకం !

42 పట్టణాల్లో 70 శాతానికి పైగా, 33 పట్టణాల్లో 50 శాతానికి పైగా ఆస్తిపన్ను వసూలైంది. ఐదు చోట్ల మాత్రమే ఆస్తిపన్ను 50 శాతం కంటే తక్కువగా పన్ను వసూలైంది. ఐదు శాతం ఎర్లీబర్డ్ ప్రోత్సాహకాన్ని రాష్ట్రంలోని అన్ని పట్టణాలకు వర్తింపజేయాలని, 39 వేల పరిమితిని ఎత్తివేయాలని పురపాలక శాఖ నిర్ణయం తీసుకొంది. ఫలితంగా పన్ను వసూళ్లు మరింతగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

ఇవీ చూడండి : లాక్​డౌన్​లోనూ రోడ్లపైకి భారీగా వాహనాలు

ABOUT THE AUTHOR

...view details