Cold Increased In Alluri Sitamaraju District: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలిగాలుల ప్రభావంతో ప్రజలు అల్లాడుతున్నారు. పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో చలిమంటలతో తాత్కాలికంగా సేద తీరుతున్నారు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో గత నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోయి శీతలమయమైంది. చలి కారణంగా ఉదయం 9 గంటల వరకు ప్రజలు బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు.
చలి కాచుకుంటున్న ఆంధ్రా.. మూగజీవులు సైతం గజగజ - Andhra Pradesh Main News
cold in Alluri Sitamaraju district: ఏపీపై చలిపులి పంజా విసురుతోంది. చలిగాలులు, మంచు కారణంగా ప్రజలు గజగజ వణుకుతున్నారు. అల్లూరి జిల్లాలో గత నాలుగు రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. చలి తీవ్రత పెరగడంతో ప్రజలు బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు.
చలి
చింతపల్లి, మినుములూరులో 7 డిగ్రీలు, పాడేరులో 8 డిగ్రీలు కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. చలి పెరగడంతో ఎక్కడికక్కడ చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. మూగజీవాలు సైతం చలిమంటలు వద్ద సేద తీరుతున్నాయి. ఉన్ని దుస్తులు వేసుకుంటే గాని బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది.
ఇవీ చదవండి: