రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే పలు జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం రాత్రి కోహీర్ (సంగారెడ్డి జిల్లా)లో 7.2, గిన్నెధరి(కుమురం భీం జిల్లా)7.9, డోంగ్లీ(కామారెడ్డి జిల్లా)లో 8.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాష్ట్రంలో మళ్లీ విజృంభిస్తోన్న చలి - Cold intensity news in the telangana
రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి మళ్లీ విజృంభిస్తోంది. శనివారం పలు జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పొద్దున్నే బయటకు రావాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు.
రాష్ట్రంలో మళ్లీ విజృంభిస్తోన్న చలి
ఈ నెలలో 7 డిగ్రీలకు పడిపోవడం ఇదే తొలిసారి. చలి తీవ్రతకు ప్రజలు వణుకుతున్నారు. చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.
ఇదీ చూడండి :భారత్ బంద్‌లో మా శ్రేణులు పాల్గొంటారు: కేసీఆర్