తెలంగాణ

telangana

ETV Bharat / state

Coffee Face Mask For Health Skin Telugu : కాఫీ స్క్రబ్​తో ఆ సమస్య దూరం.. మీరూ ఓ సారి ట్రై చేయండి!

Coffee Face Mask For Health Skin Telugu : ఉద్యోగంలో భాగంగా.. ఒక్కోసారి ఎండలో తిరగడం సహజం. సూర్యరశ్మి శరీరానికి తగలడం వల్ల కొంత మందిలో మెలనిన్​ ఉత్పత్తి అధికంగా పెరుగుతుంది. దీనివల్ల ముఖంపై మొటిమలు, నల్లమచ్చలు, ముడతలు, ఉబ్బినట్టు.. ఏర్పడతాయి. వాటిని నివారించేందుకు సన్​స్ర్కీన్​ లోషన్లు ఎక్కువగా వినియోగిస్తాం. అవి కొన్ని రోజులు ఆపివేస్తే మళ్లీ ఈ సమస్యలు వస్తాయి. మళ్లీ లోషన్లు కొనుగోలు చేయడమంటే ఖర్చుతో కూడుకున్నది. అలా కాకుండా వంటింట్లో లభించే పదార్థాలతో ఈ సమస్యలకు చక్కటి పరిష్కారాలు పొందవచ్చు. మరవేంటో తెలుసుకుందామా..?

Coffee Face Mask Benefits Every Skin
Coffee Face Mask For Glowing Skin

By ETV Bharat Telangana Team

Published : Oct 5, 2023, 2:10 PM IST

Coffee Face Mask For Health Skin Telugu : ముఖం పొలుసులుగా ఊడిపోవడం, ఉబ్బినట్లుగా తయారవడం, జిడ్డుగా ఉండడం.. ఇలా మీకు ఎప్పుడైనా అనిపించిందా.. దాన్ని తగ్గించుకునేందుకు పరిష్కారమార్గాల కోసం వెతుకున్నారా..ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారికి కాఫీ స్రబ్​ లేదా ఫేస్​మాస్క్​ మంచి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇందుకోసం కావాల్సినవి పదార్థాలు..

  • పాలు - టీస్పూన్
  • తేనె - టీస్పూన్
  • ఆలివ్‌ నూనె - టీస్పూన్
  • బ్రౌన్‌ షుగర్‌ - ఒకటిన్నర స్పూన్లు
  • బరకగా దంచిన కాఫీ పొడి - 2 టీస్పూన్లు

మెరిసిపోయే చర్మం కోసం.. ఈ హోమ్​ మేడ్​ పేస్ట్​ ట్రై చేయండి..

ఒక బౌల్​ తీసుకుని అందులో పైన తెలిపిన పదార్ధాలు అన్ని వేసి పేస్ట్​లా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి గుండ్రంగా రుద్దుతూ అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకొని.. ఆపై చల్లటి నీటితో కడుక్కోవాలి. అనంతరం ముఖంలో వచ్చిన మార్పు(Face Changes)ను మీరు గమనించవచ్చు. కాఫీ ఫేస్​ మాస్క్​ ఉబ్బిన ముఖాన్ని తిరిగి సాధారణ స్థితికి తెస్తుంది. ముఖాన్ని మృదువుగా.. అందంగా మారుస్తుంది. ముఖానికే కాకుండా బాడీ స్క్రబ్​గా కూడా వాడొచ్చు.

వర్షాకాలంలో చర్మం జాగ్రత్త! ఈ ఇంటి చిట్కాలతో సౌందర్యం పెంచుకోండి!

Uses of Coffee Face Mask in Telugu: ఈ ఫేస్‌మాస్క్‌ తయారుచేసుకోవడం ఎంతో సులభంగా ఉంది కదూ! అంతేకాదు.. ఇందులో వాడిన పదార్థాల్లో బోలెడన్ని సౌందర్య రహస్యాలు కూడా దాగున్నాయి. మరి ఏ పదార్థం ఎందుకు మీ చర్మానికి ఎలాంటి మేలు చేస్తుందంటే..?

  • ఈ కాఫీ స్క్రబ్​లో కలిపిన బ్రౌన్​ షుగర్​ చర్మం పొలుసులుగా ఊడిపోకుండా ఆపేందుకు ఉపయోగపడుతుంది. యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. మృతకణాల్ని తొలగిస్తుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు.. గ్లైకోలికామ్లం చర్మాన్ని ప్రకాశవంతంగా తయారు చేసేందుకు సహకరిస్తాయి.
  • కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై కాలుష్య ప్రభావం చూపకుండా అడ్డుకుంటాయి. ఫలితంగా నవయవ్వనంగా మెరిసిపోవచ్చు.డార్క్​ సర్కిల్​, మొటిమలు వంటి వాటిని తగ్గించే సామర్థ్యం ఈ కాఫీమాస్క్​కు ఉంది.
  • తేనెలోని యాంటీ మైక్రోబియల్‌ గుణాలు మొటిమల్ని తగ్గించడంలో సహకరిస్తాయి. అలాగే మృతకణాలు, ముఖంపై ముడతలు-గీతల్ని తగ్గించే శక్తి తేనె సొంతం.
  • పొడిబారిన చర్మానికి సాంత్వన చేకూర్చడంలో పాలది మొదటి స్థానం. ఇందుకు పాలలోని ‘ఎ’ విటమిన్‌ తోడ్పడుతుంది. ఇక ఇందులోని ‘డి’ విటమిన్‌ ముఖంపై ఉన్న గీతల్ని, చిన్న చిన్న ముడతలను తగ్గించడంతో పాటు.. చర్మం సాగే గుణాన్ని అభివృద్ధి చేస్తోంది.
  • ఆలివ్‌ నూనె చర్మానికి సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్లు A, D, E, K చర్మ ఆరోగ్యానికి చాలా అవసరం. ఈ నూనెలోని యాంటీ బ్యాక్టీరియల్​ లక్షణాలు వాతావరణంలోని బ్యాక్టీరియా ప్రభావం శరీరంపై పడకుండా రక్షిస్తాయి.

గ్లోయింగ్ స్కిన్​ కావాలా? మీ డైట్​లో ఈ చిన్న మార్పులు చేస్తే సరి!

చర్మం పొడిబారుతోందా?.. చుండ్రు​ సమస్య వెంటాడుతోందా?.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

ABOUT THE AUTHOR

...view details