తెలంగాణ

telangana

ETV Bharat / state

Cocktail Antibodies: కరోనా రోగుల్లో సత్ఫలితాలు - cocktail anti bodies treatment

కరోనా రోగులకు కాక్‌టెయిల్‌ యాంటీబాడీస్‌ ఇవ్వడం వల్ల త్వరితగతిన కోలుకుంటున్నారని ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్‌ కె.గోపాలకృష్ణ తెలిపారు. ఇటీవల ప్రయోగాత్మకంగా విజయవాడలో ఇద్దరికి ఇలా చికిత్స అందించినట్లు వెల్లడించారు.

Cocktail Antibodies
Cocktail antibodies: కరోనా రోగుల్లో సత్ఫలితాలు

By

Published : May 29, 2021, 1:04 PM IST

కరోనాపై పోరాటంలో భాగంగా.. యాంటీ బాడీ కాక్‌టెయిల్‌ మందు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్​లోనూ అందుబాటులోకి వచ్చింది. గత ఏడాది అక్టోబర్‌లో.. అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు కరోనా పాజిటివ్‌ వచ్చినపుడు ఈ మందు తీసుకున్నారు. అదే ఏడాది నవంబర్‌లో అమెరికా ఈ కాక్‌టెయిల్‌ యాంటీ బాడీ మందుకు.. అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది.

కరోనా రోగుల్లో సత్ఫలితాలు

వేగంగా ఇస్తే ఉపయోగం ఎక్కువ..

కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధరణ అయిన బాధితులు.. తొలి 5 నుంచి 10 రోజుల్లోపు ఈ మందు వాడితే సత్ఫలితాలిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ చికిత్సా విధానం ద్వారా ఆసుపత్రిలో చేరికను 70 శాతం తగ్గించొచ్చనేది వైద్యులు అంటున్నారు. ప్రాణాపాయం కూడా తగ్గుతుందని పేర్కొంటున్నారు. విజయవాడలో తొలిసారిగా ఇద్దరు కొవిడ్ బాధితులకు గురువారం ఈ కాక్‌టెయిల్‌ యాంటీబాడీస్‌ అందించారు. కరోనా చికిత్సలో ఈ కాక్‌టెయిల్‌ యాంటీబాడీస్‌ ప్రామాణికతను ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్‌ కె.గోపాలకృష్ణ ముఖాముఖిలో వివరించారు.

ఇవీ చదవండి:covid-19: రోగులను పీల్చిపిప్పిచేస్తున్న ప్రైవేట్​ ఆస్పత్రులు

ABOUT THE AUTHOR

...view details