తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆంధ్రాలో జోరుగా కోడి పందేల పోటీలు - రావులపాలెం

ఏపీ తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో కోడి పందేలు జోరుగా జరుగుతున్నాయి. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచే పందేలు ప్రారంభమయ్యాయి. గుండాటలు కూడా జోరుగా నిర్వహించారు. కోడి పందేల నేపథ్యంలో లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి.

ఉదయం నుంచే కోడి పందేలు షురూ.. చేతులు మారుతున్న లక్షల రూపాయలు
ఉదయం నుంచే కోడి పందేలు షురూ.. చేతులు మారుతున్న లక్షల రూపాయలు

By

Published : Jan 14, 2021, 4:34 PM IST

ఏపీ తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. నువ్వా- నేనా అన్నట్లు పందెం కోళ్లు కొట్లాడుకున్నాయి. నియోజకవర్గంలోని ఆత్రేయపురం, రావులపాలెం ,కొత్తపేట, ఆలమూరు మండలాల్లో ఉదయం నుంచి కోడి పందేలు నిర్వహించారు.

నిమిషాల వ్యవధిలోనే లక్షలాది రూపాయలు చేతులు మారాయి. వీటితో పాటు గుండాటలు కూడా జోరుగా నిర్వహించారు. ప్రజలు కోడి పందేలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. పందెంరాయుళ్లు రెచ్చిపోయి... పార్టీలకు అతీతంగా కోడి పందాల శిబిరాల ఏర్పాటు చేసి పోటీలు నిర్వహిస్తున్నారు.

ఉదయం నుంచే కోడి పందేలు షురూ.. చేతులు మారుతున్న లక్షల రూపాయలు

ABOUT THE AUTHOR

...view details