మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్టేషన్లో నాగుపాము హల్చల్ చేసింది. ఠాణాలోకి దూరిన సర్పాన్ని చూసి పోలీసులంతా భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. వెంటనే ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీకి సమాచారమిచ్చారు. పామును పట్టేందుకు వచ్చిన సంస్థ సభ్యుడు రాజు గంట సేపు శ్రమించాడు. ఎట్టకేలకు సర్పరాజాన్ని పట్టుకుని బంధించి తీసుకెళ్లటంతో పోలీస్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
కుషాయిగూడ పోలీస్స్టేషన్లో నాగుపాము హల్చల్ - COBRA SNAKE IN KUSHAIGUDA POLICE STATION
కరుడగట్టిన నేరస్థులను సైతం గడగడ వణికించే పోలీసులను ఓ నాగుపాము కాసేపు భయపెట్టింది. దొంగలను పరుగెత్తించే ఆ రక్షకభటులు తమను తాము రక్షించుకునేందుకు పరుగుతీసేలా చేసింది. ఈ ఘటన కుషాయిగూడ ఠాణాలో చోటుచేసుకుంది.
![కుషాయిగూడ పోలీస్స్టేషన్లో నాగుపాము హల్చల్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3905854-thumbnail-3x2-ppp.jpg)
COBRA SNAKE IN KUSHAIGUDA POLICE STATION