తెలంగాణ

telangana

ETV Bharat / state

చల్లగా షి'కారు'.. మట్టి, పేడతో కోటింగ్ - Karnataka devotees innovated car latest News

తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ఆ కారు చూపరులను ఆకట్టుకుంది. కారు యాజమానులు దర్శనం కోసం లోనికి వెళ్లగా పార్క్ చేసిన కారును జనాలు ఆసక్తిగా తిలకించారు. అనంతరం కారు వద్ద నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చారు.

Soil Coated Car, Tirupathi
కూల్ కారు

By

Published : Mar 30, 2021, 1:17 PM IST

కూల్ కారు

ఏపీ తిరుమలలో ఓ కారును భక్తులు ఆసక్తిగా తిలకించారు. కర్ణాటక నుంచి శ్రీవారి దర్శనం నిమిత్తం వచ్చిన భక్త బృందం.. కారును నందకం అతిథి గృహం వద్ద పార్కింగ్ చేసి లోపలికి వెళ్లారు. ఈ కారుపై మొత్తం మట్టి, పేడతో పూత పూశారు. ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల కారుకు ఇలా పూత పూసినట్లు డ్రైవర్ తెలిపారు.

వేడి నుంచి ఉపశమనం కోసమే..

మట్టి, ఆవు పేడ పూయడం వల్ల కారులో ప్రయాణిస్తున్న సమయంలో వేడి నుంచి ఉపశమనం లభిస్తుందని వివరించారు. పార్క్ చేసిన కారును ఆసక్తిగా తిలకించిన భక్తులు ఫోటోలకు ఎగబడ్డారు.

ABOUT THE AUTHOR

...view details