భాజపా నాయకులు భాగ్యలక్ష్మి గుడికి వెళ్తే, తెరాస నాయకులు నల్లపోచమ్మ గుడిని కూల్చేశారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. నాయకత్వాన్ని తయారు చేసుకోలేని భాజపా తమ నాయకులను ఆకర్షిస్తోందని మండిపడ్డారు.
భాజపాకు ఆ దమ్ములేక కాంగ్రెస్ వైపు చూస్తోంది: రేవంత్ రెడ్డి - హైదరాబాద్ తాజా సమాచారం
భాజపా నేతలు నాయకత్వాన్ని తయారు చేసుకోలేక కాంగ్రెస్ నాయకులను లాక్కుంటున్నారని ఎంపీ రేవంత్రెడ్డి ఆరోపించారు. ఇంటిని చక్కబెట్టుకోలేక ఇతర పార్టీల వారిని తీసుకుంటే ప్రయోజమేంటని ప్రశ్నించారు. హైదరాబాద్లో కర్ఫ్యూ కావాలా అని కేటీఆర్ అడగడంలో అర్థం లేదన్నారు.
![భాజపాకు ఆ దమ్ములేక కాంగ్రెస్ వైపు చూస్తోంది: రేవంత్ రెడ్డి cngress mp revanth fire on bjp to join congress leaders in bjp](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9635674-599-9635674-1606126570990.jpg)
కాంగ్రెస్ నాయకులను భాజపా లాక్కుంటోంది : రేవంత్ రెడ్డి
బయటి పార్టీల నాయకులను తీసుకుని ప్రయోజనమేంటని ఆయన ప్రశ్నించారు. మహావృక్షం లాంటి కాంగ్రెస్ను బలహీనపరిచినా ఎలాంటి నష్టం ఉండదన్నారు. పరికికంప లాంటి భాజపాను మాత్రం ఎవరూ ముట్టుకోవద్దని హెచ్చరించారు. 20 ఏళ్లుగా కర్ఫ్యూ లేని హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ కర్ఫ్యూ కావాలా అని అడగడంలో అర్థం లేదని రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు.
ఇదీ చూడండి:ప్రజల గొంతు వినిపించే అవకాశం ఇవ్వండి: రేవంత్రెడ్డి
Last Updated : Nov 23, 2020, 4:59 PM IST