ఏపీ సీఎం సహాయనిధి పేరుతో రూ.112 కోట్లు కొల్లగొట్టేందుకు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు భారీ కుట్రకు తెరలేపారు. నకిలీ సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా ఈ మొత్తాన్ని నగదుగా మార్చేందుకు యత్నించగా.. బ్యాంకు అధికారుల అప్రమత్తతతో ఆగింది. దిల్లీ, బెంగళూరు, కోల్కతాలోని ఎస్బీఐ శాఖల్లో నకిలీ చెక్కుల ద్వారా నగదు మార్చుకునేందుకు కొందరు ప్రయత్నించారు.
సీఎంఆర్ఎఫ్ పేరిట నకిలీ చెక్కులు
ఏపీ సీఎం సహాయ నిధి నుంచి రూ.112 కోట్ల మేర కొల్లగొట్టేందుకు దుండగులు చేసిన ప్రయత్నాలకు బ్యాంకుల అప్రమత్తతో అడ్డుకట్ట పడింది. దిల్లీ, బెంగుళూరు, కోల్కతా ఎస్బీఐ బ్రాంచ్ల ద్వారా చెక్కులు మార్చుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.
సీఎంఆర్ఎఫ్ పేరిట నకిలీ చెక్కులు
కర్ణాటకలోని మంగళూరు ఎస్బీఐ మూడ్బద్రి శాఖలో రూ. 52.65 కోట్లకు ఒక చెక్కు, దిల్లీలోని సీసీపీసీఐ శాఖ ద్వారా రూ.39.85 కోట్లకు ఒక చెక్కు కోల్కతా సర్కిల్ లోని మోగ్రాహత్ శాఖలో రూ. 24.55 కోట్ల చెక్కును నగదుగా మార్చుకునేందుకు సమర్పించారు. చెక్కులపై ఉన్న వివరాల ఆధారంగా వాటిని ధ్రువీకరించుకోడానికి బ్యాంకుల అధికారులు వెలగపూడి ఎస్బీఐని సంప్రదించారు. దీంతో ఈ నకిలీ చెక్కుల వ్యవహారం బయటపడింది.
ఇదీ చదవండి:రిజిస్ట్రేషన్లపై తహసీల్దార్లకు శిక్షణ...